పంచాంగం
తేదీ 11- 09 – 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల అష్టమి సా. 6.08 వరకు
నక్షత్రం: జ్యేష్ఠ సా. 5.30 వరకు తదుపరి మూల
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: ఏమీ లేవు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మోసపోయే ప్రమాదం ఉంది.
వృషభ రాశి: మిశ్రమకాలం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. అనవసర ఆలోచనలు ప్రశాంతతను దూరం చేస్తాయి. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథున రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి: ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయరాదు. తప్పుదారి పట్టించే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు సహనంతో వ్యవహరించి వాటిని పరిష్కరించుకోవాలి. ఏ పనైనా ఇంటి పెద్దలతో చర్చించి మొదలు పెట్టడం మంచిది.
సింహరాశి: చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు. పనిభారం ఎక్కువవుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
కన్యారాశి: కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. చేయని తప్పుకు నిందలు పడాల్సి రావచ్చు. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
తులారాశి: కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సత్ప్రవర్తనతో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబంలో నెలకొన్న సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. వ్యాపారులు స్వల్ప లాభాలను పొందుతారు.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా ఫలితాలు వెలవడతాయి. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులు గతం కంటే మేలైన లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
ధనస్సు రాశి: బంధుమిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తనతో కలత చెందుతారు. పెద్దల జోక్యంతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆప్తుల నుంచి అందిన శుభవార్త సంతోషాన్నిస్తుంది.
మకర రాశి: వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు అందుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం భాగస్వామ్య వ్యాపారాలను మొదలుపెట్టవచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. రాజకీయ రంగాల వారు నూతన పదవీ బాధ్యతలు చేపడతారు.
కుంభరాశి: కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏ పనైనా ఇంటి పెద్దల సలహాతో మొదలు పెట్టడం మంచిది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చంచల మనస్తత్వం వల్ల ఇబ్బందులు పడతారు. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి.
మీన రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మనసు చెడు ఆలోచనల వైపు మళ్ళుతుంది. బద్ధకాన్ని దరిచేయనీయకండి. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. చర్చల ద్వారా అవి పరిష్కారం అవుతాయి.