పంచాంగం
తేదీ 11-10-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల అష్టమి ఉ 6.41 వరకు, తదుపరి నవమి తె 5.15 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తరాషాడ రా. 1.36 వరకు, తదుపరి శ్రవణం
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి ప. 12.24 నుంచి 1.12 వరకు.
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువును ఈరోజు తిరిగి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారు.
వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేయని తప్పుకు నిందపడాల్సి రావచ్చు. వివాదాల జోలికి పోరాదు. ఆర్థిక నష్టం సంభవిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సత్ప్రవర్తనతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాలు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి: ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకొని కొత్త ప్రాజెక్టులను చేపట్టడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి. రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి.
సింహరాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీమీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగాల వారు అదనపు పదవి బాధ్యతలు చేపడతారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు వృత్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
కన్య రాశి: మిశ్రమకాలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య తీవ్రమౌతుంది. సమయం వృధా చేయరాదు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
తులారాశి: మిశ్రమకాలం. ఎవరిని నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోరాదు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. తల్లిదండ్రుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి: మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. ఫలితంగా ఒత్తిడి ఎక్కువవుతుంది. స్వల్ప అనారోగ్యానికి గురికావాల్సి రావచ్చు. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి: అదృష్టకాలం. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అపార్ధాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా ఊహించని లాభాలు అందుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి.
మకర రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. ఆచితూచి మాట్లాడాల్సిన సమయం. గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. చేపట్టిన పనులలో జాప్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలహ సూచన ఉంది.
కుంభరాశి: మిశ్రమ కాలం. కుటుంబ సభ్యులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. తోబుట్టువుల సహాయంతో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్త ఆనందాన్నిస్తుంది.
మీన రాశి: మిశ్రమకాలం. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. అనవసర రుణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో శుభవార్తలు పంచుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి.