Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 11 మార్చి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం

సూర్యోదయం: ఉ.6:14
సూర్యాస్తమయం:రా.6:02 ని
తిథి: బహుళ చవితి రా.8:22 వరకు తదుపరి బహుళ పంచమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం )
నక్షత్రము: స్వాతి పూర్తిగా
యోగం: ధృవం రా.6:41 వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: బవ . 8:25 ని. వరకు తదుపరి బాలవ
దుర్ముహూర్తం: ఉ.6:14 నుండి 7:48 వరకు
వర్జ్యం : ఉ.11:47 నుండి 1:23 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.6:31 ని.నుండి 8:00 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:55 నుండి 5:43 వరకు
అమృతఘడియలు:రా.9:27నుండి 11:03 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : మ.12:02 నుండి 12:50 వరకు

ఈ రోజు (11-03-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని పనులలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి.

వృషభం: ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.

మిథునం: వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలుంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.

సింహం: దాయదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

కన్య: ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

తుల: ధన వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో వివాదాలు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.

వృశ్చికం: కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు.

ధనస్సు: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు

మకరం: ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

కుంభం: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. మీ ప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం: దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...