పంచాంగం
తేదీ 11- 07- 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ రుతువు
సూర్యోదయం: ఉదయం 5:36 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:39 గంటలకు
తిథి: శుక్ల పంచమి ఉ 8.02 వరకు, తదుపరి షష్టి
నక్షత్రం: పుబ్బ ప.12.18 వరకు, తదుపరి ఉత్తర
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి ప. 2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. కుటుంబంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది.
వృషభ రాశి: జీవిత భాగస్వామి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పని ప్రదేశంలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తి వివరాలు పరిష్కారం అవుతాయి. చాలా కాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
మిథున రాశి: అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటక రాశి: ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు మరింత పెరుగుతాయి. ప్రత్యర్థులు మీ పనిలో అడ్డంకులు సృష్టిస్తారు. గతంలో బాధించిన అనారోగ్యం తిరిగి ఇబ్బంది పెడుతుంది.
సింహరాశి: ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు సరైన ప్రణాళికతో మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. నూతన వస్తు,వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారు ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు.
కన్యారాశి: కుటుంబ సమస్యలు తీవ్రతరం కాకుండా ఉండటానికి మౌనంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న కోర్టు వివాదాలు తీవ్రమవుతాయి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది.
తులారాశి: సమస్యలు చుట్టుముడతాయి. వ్యాపారంలో ఒడిదుడుకుల కారణంగా నష్టాలు సంభవిస్తాయి. పని భారం ఒత్తిడికి గురిచేస్తుంది. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి: అతిథుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. మనశ్శాంతి చేకూరుతుంది. వ్యాపారులకు మునుపటికంటే మెరుగైన లాభాలు అందుతాయి. ఉద్యోగులు పై అధికారులతో జాగ్రత్తగా సంభాషించాలి.
ధనస్సు రాశి: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఆలోచన వాయిదా వేయడం మంచిది. పని భారం కారణంగా ఒత్తిడికి లోనవుతారు. సమయస్ఫూర్తితో కొన్ని వివాదాలు పరిష్కరించ గలుగుతారు. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.
మకర రాశి: ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యలు చుట్టుముడుతాయి. ఇంటి సభ్యుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు మౌనంగా ఉండటం సాధారణ ఎన్నికలు మంచిది.
కుంభరాశి: ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు.
మీన రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో మనస్పర్దలు పెరుగుతాయి. అనవసర రుణాలు చేయవలసి వస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.