పంచాంగం
తేదీ 11-01-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:39 గంటలకు.
తిథి: శుక్ల ద్వాదశి ఉ 7.43 వరకు, తదుపరి త్రయోదశి
నక్షత్రం: రోహిణి మ. 12.28 వరకు, తదుపరి మృగశిర
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ప.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : మిశ్రమకాలం. మీది కానీ వ్యవహారంలో తల దూర్చవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. నూతన వస్తు, వాహన కొనుగోలుకు ఇది మంచి సమయం కాదు. మనసు చెడు ఆలోచనల వైపు మల్లుతుంది. ఒక వ్యవహారంలో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి: వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. సత్ప్రవర్తన తో ఇతరుల మనసులు గెలుచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి: మిశ్రమకాలం. చేపట్టిన పనిలో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. రుణాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో ఒక వ్యవహారంలో విభేదించాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త సంతోషాన్నిస్తుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా లాభాలు అందుతాయి.
కర్కాటక రాశి: మిశ్రమకాలం. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. వీలైనంత తక్కువగా మాట్లాడండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
సింహరాశి: బంధువుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగాల వారికి నూతన పదవీ లాభ సూచితం.
తులారాశి: కష్టకాలం. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల వినయంగా ప్రవర్తించాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త పరుచుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది.
వృశ్చిక రాశి: కుటుంబ సభ్యుల సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. బంధువుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.
ధనస్సు రాశి: ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు మేలు చేకూర్చే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధువుల నుంచి అందిన వార్త వల్ల కలత చెందుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
మకర రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. అవసరానికి తోబుట్టువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుతాయి.
కుంభరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన వారితో విభేదించాల్సి రావచ్చు. ఎవరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల శారీరక శ్రమ ఎక్కువవుతుంది.
మీన రాశి: బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఇంటి పెద్దల సాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు.