పంచాంగం
తేదీ 11-02-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు.
తిథి: శుక్ల చతుర్దశి రా. 7.00 వరకు, తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పుష్యమి సా. 6.56 వరకు, తదుపరి ఆశ్లేష
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.37 వరకు
రాహుకాలం: సా. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త వల్ల కలత చెందుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
వృషభ రాశి: అనుకూల సమయం. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గత కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి: మిశ్రమ కాలం. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. పెద్దలతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారులతో ఆచితూచి మాట్లాడాలి. చేయని తప్పుకు మాట పడాల్సి రావచ్చు. వ్యాపారులకు ఒడిదొడుకులతో కూడిన ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి: మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులను, ప్రయాణాలను వాయిదా వేయండి. అయినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
సింహరాశి: కష్టకాలం. ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ ఒక విషయంలో నిందలు పడాల్సి రావచ్చు. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవాల్సి రావచ్చు.
కన్యారాశి: భవిష్యత్తుకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సంతనాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఉద్యోగులకు పనిప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
ధనస్సు రాశి: మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. వ్యాపారులు పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేముందు కుటుంబ సభ్యులకు చెప్పి చేయడం ఉత్తమం. దూర ప్రయాణాలను వాయిదా వేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మకర రాశి: సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరోవైపు రుణదాతల ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ వాగ్వాదానికి దిగరాదు.
కుంభరాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
మీన రాశి: ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి భేదాలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించండి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తీవ్రమవుతాయి.