పంచాంగం
తేదీ 10- 09 – 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి సా. 5.42 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: అనురాధ సా. 4.25 వరకు, తదుపరి జ్యేష్ఠ
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి మాటలు పడాల్సి రావచ్చు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభ రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. నూతనంగా వ్యాపారాలు చేపట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
మిథున రాశి: శుభకాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక వ్యవహారాలు ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటు స్థానచలనం ఉంటుంది.
కర్కాటక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. మీ ప్రతిభతో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహరాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తనతో కలత చెందుతారు.
కన్య రాశి: ప్రతిభతో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మేలైన లాభాలు అందుతాయి.
తులారాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవ్వకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అవసరానికి ఆప్తుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు.
వృశ్చిక రాశి: నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
ధనస్సు రాశి: అనుకూల ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెంచుకుంటారు. ప్రత్యర్ధులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
మకర రాశి: జీవిత భాగస్వామితో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలను పొందుతారు.
కుంభరాశి: శత్రువులపై విజయం సాధిస్తారు. మనోబలం కాపాడుతూ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
మీన రాశి: కష్టకాలం. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. మానసిక అశాంతి కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంటి సభ్యుల్లో ఒకరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆలోచనల్లో నిలకడ లేకపోవడం వల్ల సమస్యల్లో పడతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది.
What’s upp all, here every onne is sharinng tese kinxs oof experience, sso it’s nic too read thiss webpage,
and I used to pay a quicxk visit this website daily.