పంచాంగం
తేదీ 10-10-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి ఉ 7.14 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: పూర్వాషాఢ రా. 1.51 వరకు, తదుపరి ఉత్తరాషాడ
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి ప. 2.48 నుంచి 3.36 వరకు.
శుభ సమయం: ఏమీ లేవు
రాహుకాలం: మ. 1.30 నుంచి నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: వ్యాపారులు పెట్టుబడిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సలహాలు విని ఏ పని మొదలు పెట్టరాదు. కుటుంబంలో వివాదాలు చెలరేగుతాయి. ఆ సమయంలో మౌనంగా ఉండటం మంచిది. పని భారం ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది తలెత్తుతుంది. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. అవివాహితులకు అడ్డంకులు తొలగి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో నెలకొన్న వివాదాలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మిథున రాశి: ముఖ్యమైన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి: ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో ఎటువంటి లావాదేవీలు జరపరాదు. గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది తిరిగి వసూలవ్వడం కష్టమవుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. ప్రత్యర్ధులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు.
సింహరాశి: అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. సహనంతో ఉండటం మంచిది. వ్యక్తిగత సమస్యలను స్నేహితులతో చెప్పడం ద్వారా పరిష్కారమవుతాయి.
కన్యా రాశి: అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు సంబంధించిన ఒక రహస్యం జీవిత భాగస్వామి వద్ద బహిర్గతం కావడం వల్ల వివాదాలు ఏర్పడతాయి.
తులారాశి: గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులు పై అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. స్నేహితులతో విభేదాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. సహనంతో వ్యవహరించాల్సిన సమయం.
వృశ్చిక రాశి: కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు గణనీయమైన లాభాలు అందుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి: పని భారం ఎక్కువవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తికాక పోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. నిందలు పడాల్సి రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది.
మకర రాశి: అదృష్ట కాలం. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో పై చేయి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడుల ద్వారా గణనీయమైన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు.
కుంభరాశి: అనుకూల సమయం. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. వేగవంతంగా పనులు పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం రావడం వల్ల సంతోషకర వాతావరణం ఉంటుంది. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. గిట్టని వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.
మీనరాశి: ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాలు చేయడం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ఎవరినీ నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరాదు.