Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 10 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,706FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 10-04-2025, గురువారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: శుక్ల త్రయోదశి రా 1.01 వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం: పుబ్బ మ 12.57 వరకు, తదుపరి ఉత్తర
శుభ సమయం: ఉ 11.04 నుంచి 11.40 వరకు
దుర్ముహూర్తం: ప 10.00 నుంచి 10.48 వరకు
రాహుకాలం: ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ప 6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అవసరానికి మించి ఖర్చులు చేస్తారు. ఫలితంగా రుణాలు చేయాల్సి వస్తుంది.

వృషభ రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. వ్యాపారులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి.

మిథున రాశి: మీ ప్రవర్తన వల్ల మీకు ఇష్టమైనవారు దూరమయ్యే ప్రమాదం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కర్కాటక రాశి: గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పిలిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులకు అనూహ్య లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

సింహరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కన్యారాశి: మొండి బకాయిలు వసూలు అవుతాయి. రుణాలను ఎక్కువ మొత్తంలో తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆహ్లాద తర్వాత వరణం ఉంటుంది. ఇంటి సభ్యుల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

తులారాశి: ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ రుణాలు దొరకడం కష్టమవుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక పని భారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆశించిన ఫలితాలు రావటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దూర ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేసుకోండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమస్యల గురించి ఎవరితోనూ పంచుకోకండి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తీవ్రమవుతాయి.

ధనస్సు రాశి: ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

మకర రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. ఎవరిని నమ్మి ఆర్థిక వ్యవహారాలు అప్పచెప్పకండి. ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. సొంత ఆలోచనలే మేలు చేస్తాయి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభరాశి: ఉద్యోగులకు అదనపు పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణముంటుంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

మీన రాశి: కుటుంబంలో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. ఆర్థిక సమస్యల వల్ల చికాకు కలుగుతుంది. పెట్టుబడి ప్రయత్నాలను వ్యాపారులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

సినిమా

బాలయ్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మళ్లీ థియేటర్లలోకి ‘భైరవ ద్వీపం’

తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్‌ల ట్రెండ్ మరోసారి జోరందుకుంది. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన క్లాసిక్ చిత్రాలు ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో రీమాస్టర్ చేసి మళ్లీ...

Peddi: పైరసీ నుంచి ‘పెద్ది’కి రక్షణ..! మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు...

Peddi: రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకు పెద్ద ఊరట లభించింది. సినిమా పైరసీకి గురి కాకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘పెద్ది’కి యాంటీ-పైరసీ...

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.. ఫిలింనగర్‌లో ఘన నివాళులు

తెలుగు జాతి ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళుల...

“వారణాసి” కోసం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్.. నెల రోజుల పాటు...

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “వారణాసి”పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రపంచ స్థాయి విజువల్స్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న...

Don 3: రణవీర్ ఔట్..! స్టార్ హీరో-దర్శకుడితో బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ...

Don 3: బాలీవుడ్ హిట్ సిరీస్ లో ఒకటి ‘డాన్’. ఒకప్పుడు అమితాబ్ నటించిన డాన్ ఓ సంచలనం. తర్వాత జనరేషన్లో షారుఖ్ ఖాన్ ఆ...

రాజకీయం

సరస్వతి పవర్‌కు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ నిర్ణయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు...

గోదావరి కాలుష్యంపై పవన్ ఫోకస్.. ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ కార్యాచరణ ప్రకటింపు

రాబోయే గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు...

మహానాడు-2026 అంచనాలకు మించి చరిత్ర సృష్టించింది: పల్లా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు-2026 అంచనాలకు మించి విజయవంతమై చరిత్ర సృష్టించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహానాడు ఘన విజయంపై స్పందించిన ఆయన, ఇది కేవలం...

షోలింగర్‌లో లోకేష్ ప్రత్యేక పూజలు.. యోగ నరసింహస్వామి, యోగ ఆంజనేయస్వామి దర్శనం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం షోలింగర్‌లో శ్రీ అమృతవల్లి తాయారు సమేత యోగ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాణిపేట జిల్లాలోని...

సూపర్ స్టార్ ఎనలిస్ట్‌కు ఏమైంది?.. ఎందుకీ డౌన్ ఫాల్?

ఒకప్పుడు తెలుగు మీడియాలో రాజకీయ విశ్లేషకుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలాది మంది విద్యార్థులకు బోధించిన అధ్యాపకుడిగా, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ ఇచ్చిన...

ఎక్కువ చదివినవి

కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు.. మే 30న కొత్త ముఖం?

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి మే 30న కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య...

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి.. చత్రపతి ధర్మరక్షణ సేన విజ్ఞప్తి

గోమాత రక్షణ, గోసేవ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చత్రపతి ధర్మరక్షణ సేన విజ్ఞప్తి చేసింది. గోమాతను జాతీయ ప్రాణి, జాతీయ జంతువుగా ప్రకటించాలని...

ఎన్టీఆర్‌కు తారక్ నివాళి.. మరోసారి కనిపించిన కుటుంబ గౌరవం

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్...

సాధక్‌ల శ్రమతోనే జనసేనకు దేశవ్యాప్త గుర్తింపు: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ బలోపేతం, విస్తరణలో సాధక్‌లు అత్యంత కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సాధక్‌లు రాత్రింబవళ్లు...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు..! ఏమన్నారంటే..

Chiranjeevi: ‘సినిమా ధియేటర్ల మనుగడకు పర్సంటేజీ విధానం కోరుతున్నామని.. ఇది ‘పెద్ది’కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. ఇండస్ట్రీ’దని తెలంగాణ టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ధియేటర్లు,...