పంచాంగం
తేదీ 09- 09 – 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల షష్ఠి సా. 4.47 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: విశాఖ ప. 2.50 వరకు, తదుపరి అనురాధ
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి మ. 2.46 నుంచి 3.34 వరకు
శుభ సమయం: ఉ 6.00 నుంచి 7.00 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఆప్తుల నుంచి విన్న శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్లీ తిరగబడుతుంది. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మిథున రాశి: తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు. అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు.
కర్కాటక రాశి: నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ఒక సమస్య నుంచి బయటపడతారు. సహనంగా ఉండాల్సిన సమయం. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.
సింహరాశి: మిశ్రమకాలం. ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించాల్సి ఉంటుంది. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
కన్యారాశి: శారీరక శ్రమ ఎక్కువవుతుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొంటారు.
తులారాశి: అదృష్ట కాలం. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. సొంతింటి కల నెరవేరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి: మిశ్రమకాలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సత్ప్రవర్తనతో ఇతరుల మనసు గెలుచుకుంటారు. ప్రతిభతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. వ్యాపారులకు మంచి లాభాలు అందుతాయి.
ధనస్సు రాశి: శారీరక శ్రమ పెరుగుతుంది. మనస్థాపం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. కాబట్టి ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి అందిన వార్త బాధిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడతాయి.
మకర రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తెలివితేటలతో వ్యవహరించాలి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వాటిని మనో బలంతో ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే ఆలోచన వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడతాయి. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి.
కుంభరాశి: అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ పనైనా కుటుంబ సభ్యుల సలహా తీసుకొని ప్రారంభించడం మంచిది.
మీన రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్నిస్తుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు. చేపట్టిన పనులు ఇంటి పెద్దల సహకారంతో పూర్తి చేయగలుగుతారు.