పంచాంగం
తేదీ 09-10-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల షష్ఠి ఉ 7.56 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: మూల రా. 1.37 వరకు, తదుపరి పూర్వాషాఢ
దుర్ముహూర్తం: ఉ. 11.36 నుంచి మ.12.24 వరకు
శుభ సమయం: సా. 4.00 నుంచి 5.00 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ముఖ్యమైన పనులను వాయిదా వేయరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యాపార భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వల్పంగా ఆర్థిక నష్టం సంభవిస్తుంది. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి: నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. ఆ సమయంలో పాటించడం మంచిది. మీ ప్రవర్తనతో కుటుంబ సభ్యులు కలత చెందుతారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి: ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఒక పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు అందుతాయి.
కర్కాటక రాశి: మిశ్రమకాలం. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు చోటు చేసుకుంటాయి. పెద్దల జోక్యంతో అవి పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయకపోవడం మంచిది. ఆప్తుల నుంచి అందిన వార్త ఆనందాన్నిస్తుంది. మానసిక ప్రశాంతతను దూరం చేసే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనో నిబ్బరంతో వాటిని ఎదుర్కోవాలి.
సింహరాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. నెమ్మదిగా చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ లాభాలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సత్ప్రవర్తనతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు వారి అభీష్టం మేరకు స్థాన చలన సూచనలు ఉన్నాయి.
కన్యా రాశి: మిశ్రమకాలం. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని సమయాల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది. ఆలోచనలు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి.
తులారాశి: అదృష్ట కాలం. తల్లిదండ్రుల మద్దతుతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం ఈరోజు ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు.
వృశ్చిక రాశి: కష్టకాలం. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు చుట్టు ముడుతాయి. ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. అరువు తీసుకున్న వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు అవసరం.
ధనస్సు రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. నూతన విద్యావకాశాలను అందుకుంటారు. వ్యాపారులకు స్వల్పంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ లాభాలను పొందుతారు.
మకర రాశి: ఆలోచనల్లో నిలకడ అవసరం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు. అరువు తీసుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదించాల్సి రావచ్చు.
కుంభరాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి: అదృష్ట కాలం. సమయానికి సాయం చేసేవారు ఉన్నారు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.