పంచాంగం
తేదీ 09-01-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు.
తిథి: శుక్ల దశమి మ. 12.00 వరకు, తదుపరి ఏకాదశి
నక్షత్రం: భరణి మ. 3.08 వరకు, తదుపరి కృతిక
శుభ సమయం: సా. 5.26 నుంచి 6.09 వరకు
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తదుపరి మ. 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన ఆదాయాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి.
వృషభ రాశి: అనుకూల ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో అందరినీ మెప్పిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం భవిష్యత్తుకు మేలు చేకూరుస్తుంది. కుటుంబ సమస్యలను చొరవ తీసుకుని పరిష్కరించాలి. వ్యక్తిగత సమస్యలను తల్లితో చర్చించడం వల్ల పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.
మిథున రాశి: అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శక్తికి మించి శ్రమించాల్సి వస్తుంది. అధిక పని భారం కారణంగా ఒత్తిడికి గురవుతారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారితో మాట్లాడేటప్పుడు మౌనం గా ఉండటం మంచిది. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆస్తి సంబంధ విషయాల్లో బంధువులతో విభేదించాల్సి రావచ్చు.
కర్కాటక రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సమస్యలు పెరుగుతాయి. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. ఎవరితోనూ వాగ్వాదం చేయరాదు. అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబంలో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది.
సింహరాశి: అదృష్ట కాలం. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో పై చేయి సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ.. పరస్పరం చర్చించుకోవడం వల్ల అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. అనుభవజ్ఞుల సలహా మేరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను అమలు చేయొచ్చు.
కన్యా రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది. ఓర్పుతో ఉండాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సమస్యలు చుట్టుముట్టడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగులు పై అధికారుల పట్ల వినయంగా ఉండాలి. పని ప్రదేశంలో కొంత ఒత్తిడి ఉంటుంది.కుటుంబ సభ్యుల నుంచి అందిన వార్త బాధ కలిగిస్తుంది.
తులారాశి: ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. మంచి ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అధిక శ్రమ కారణంగా అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేయద్దు.కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చిక రాశి: ఇంటి పెద్దల సహకారంతో ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టు పెట్టాలనుకునే వారికి సరైన సమయం. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
ధనస్సు రాశి: ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. చాలాకాలంగా కుటుంబంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టడానికి అనుకూల సమయం.
మకర రాశి: స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు.
కుంభరాశి: తప్పుదారి పట్టించే వారు ఉన్నారు. సమయ స్ఫూర్తి తో వ్యవహరించాలి. కీలక సమయాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోరాదు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. రుణాలకు దూరంగా ఉండండి. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
మీన రాశి: గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు చర్చించుకోవడం వల్ల తొలగిపోతాయి. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. కొన్ని సందర్భాల్లో బంధుమిత్రులతో విభేదించాల్సి రావచ్చు. ఉద్యోగులకు పని ప్రదేశంలో కొంత ఒత్తిడి ఉంటుంది. సంయమనం పాటించండి.