పంచాంగం
తేదీ 09-12-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:27 గంటలకు
తిథి: శుక్ల నవమి తె 3.33 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: పూర్వభాద్ర ప. 1.24 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర
శుభ సమయం: ఉ 6.00 నుంచి 7.00 వరకు
దుర్ముహూర్తం: ప.12.24 నుంచి1.12 వరకు, తిరిగి ప.2.46 నుంచి 3.34 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కుటుంబంలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టాలి. ఇంటి సభ్యుల్లో ఒకరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. కుటుంబంలో అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
వృషభ రాశి: ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. అత్యవసర సమయాల్లో ఇతరులపై ఆధారపడి రాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు తలెత్తవచ్చు.
మిథున రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. పిల్లల ప్రవర్తన వల్ల ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
కర్కాటక రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ వనరులను పెంచుకుంటారు. విలాసాలకు పోయి అదనపు ఖర్చులు పెంచుకుంటారు. ఫలితంగా రుణాలు చేయాల్సి రావచ్చు. ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి: పురోగతిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. విరోధులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి, కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని తొలగించుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వ్యాపారులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి: కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనుకునే వ్యాపారులకు ఈరోజు అనువైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు అందుతాయి.
తులారాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మనశ్శాంతి పొందుతారు. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు ఉద్రిక్తత కు దారితీస్తాయి. అరువు తీసుకున్న వాహనాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. వాటిని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి: వ్యాపారులకు విశేషమైన రోజు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అద్భుతమైన లాభాలను పొందుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ధనస్సు రాశి: ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
మకర రాశి: వ్యాపారులకు కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం. జీవిత భాగస్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టాలి. ఆప్తులతో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి.
కుంభరాశి: చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. తోబుట్టువులతో నెలకొన్న ఆస్తి సంబంధ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ బంధాల బలోపేతంపై దృష్టి పెట్టాలి. పిల్లలతో విలువైన సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మీన రాశి: సమస్యలు చుట్టూ ముడతాయి. మీ ప్రమేయం లేనప్పటికీ కొన్ని సందర్భాల్లో మాటలు పడాల్సి రావచ్చు. చేయని తప్పుకు నిందలు పడతారు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదించాల్సి రావచ్చు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి