పంచాంగం
తేదీ 09-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: శుక్ల ద్వాదశి రా. 11.36 వరకు, తదుపరి త్రయోదశి
నక్షత్రం: మఖ ఉ 11.36 వరకు, తదుపరి పుబ్బ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: ప 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: ప్రతికూల సమయం. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మాటల్లో పొదుపు పాటించండి. మనసు గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆప్త మిత్రులు దూరమయ్యే అవకాశం ఉంది. బంధువుల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది.
వృషభ రాశి: కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు.
మిథున రాశి: ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తుకు మేలు చేకూర్చి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి.
కర్కాటక రాశి: ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. అప్రయత్న కార్యసిద్ధి ఉంది. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
సింహరాశి: బంధుమిత్రులతో అకారణ వైరం కలుగుతుంది. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి సంభాషణలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. ఈరోజు ఎవరికైనా రుణాలు ఇస్తే తిరిగి వసూల్ అవ్వడం కష్టమవుతుంది. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి.
కన్యారాశి: ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. బంధుమిత్రులతో ఒక వ్యవహారంలో విభేదించాల్సి వస్తుంది. ఆశించిన ఫలితాలు రావటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
తులారాశి: స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
వృశ్చిక రాశి: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులు అయితే తప్ప ఈరోజు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు తావివ్వకండి. మిమ్మల్ని రెచ్చగొట్టే వారున్నారు జాగ్రత్తగా ఉండండి.
ధనస్సు రాశి: బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకర రాశి: కుటుంబంలో సమస్యలు తలెత్తడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. రుణదాతల ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెంచడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో విభేదించకండి. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుకుంటారు.
మీన రాశి: ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న స్థిరాస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీది కానీ వ్యవహారంలో. జోక్యం చేసుకోవద్దు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టడానికి అనుకూల సమయం. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేస్తారు.