పంచాంగం
తేదీ 08- 09 – 2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:50 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: శుక్ల పంచమి ప. 3.35 వరకు, తదుపరి షష్టి
నక్షత్రం: స్వాతి ప. 12.47 వరకు తదుపరి విశాఖ
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
శుభ సమయం: ఉ 7.00 నుంచి 9.00 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు ఈరోజు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలను మొదలు పెట్టొచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
వృషభ రాశి: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల రాక సంతోషాన్నిస్తుంది. కుటుంబంలోకి కొత్త వ్యక్తులను ఆహ్వానిస్తారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.
మిథున రాశి: కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు మెరుగైన లాభాలను పొందుతారు. విద్యార్థులు నూతన విద్యావకాశాలను అందుకుంటారు.
కర్కాటక రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ తిరగబడుతుంది. ఆహార నియమాలు పాటించాలి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.
సింహరాశి: ఏ పనైనా కుటుంబ సభ్యులతో చర్చించి మొదలుపెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి.
కన్యారాశి: కొన్ని విషయాల్లో సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసేటప్పుడు ఓపిక అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను చర్చించి పరిష్కరించుకోవాలి. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించరాదు.
తులారాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంటి పెద్దల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి: సత్ప్రవర్తనతో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం. మానసిక ప్రశాంతతను పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనోబలంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి: చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రుణ విముక్తి కలుగుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
మకర రాశి: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్ధులు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. తెలివిగా వ్యవహరించాలి. గతంలో ఇబ్బంది పెట్టనా అనారోగ్యం మళ్లీ తిరగబెడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సహకారంతో ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు.
కుంభరాశి: శారీరక శ్రమ ఎక్కువవుతుంది. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడికి లోనవుతారు. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరాదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి రుణాలు చేయాల్సి రావచ్చు. ఆప్తులతో మనస్పర్ధలు పెరుగుతాయి.