పంచాంగం:
తేదీ 08-10-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల పంచమి ఉ 6.24 వరకు తదుపరి షష్ఠి
నక్షత్రం: జ్యేష్ట రా.12.56 వరకు, తదుపరి మూల
దుర్ముహూర్తం: ఉ 08.24 నుంచి 9.12 వరకు, రా 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అదృష్ట కాలం. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు సరైన సమయం. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. కుటుంబంలోని అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభ రాశి: శుభకాలం. సత్ప్రవర్తనతో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
మిథున రాశి: చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆర్థిక నష్టం సంభవిస్తుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
కర్కాటక రాశి: మిశ్రమ కాలం. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది. మనోనిబ్బరంతో ఉండాల్సిన సమయం. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అరువు తీసుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది.
సింహరాశి: కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు విస్తరణ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
కన్య రాశి: కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. దూకుడుగా వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం.
తులారాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మొండిగా వ్యవహరించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆప్తులతో కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు కలత చెందుతారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చిక రాశి: మిశ్రమ కాలం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నమ్మినవారే మోసం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోరాదు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
ధనస్సు రాశి: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
మకర రాశి: కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు సకాలంలో అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి.
కుంభరాశి: పని భారం ఎక్కువవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనవసర విషయాల గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు.
మీన రాశి: శుభకాలం. అవసరానికి తగిన సాయం అందుతుంది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్నిస్తుంది. కుటుంబ కలహాలు తగ్గు ముఖం పడతాయి. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.
