పంచాంగం:
తేదీ 08-12-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:27 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి ఉ 7.46 వరకు, తదుపరి అష్టమి తె 4.48 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: శతభిషం ప. 2.49 వరకు, తదుపరి పూర్వభాద్ర
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా. 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: ఇంటి పెద్దలతో చర్చించి మొదలుపెట్టిన పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మీ మాటలతో ఇతరులు కలత చెందే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి.
వృషభ రాశి: రుణదాతల ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథున రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారులు తీవ్రంగా శ్రమించి స్వల్ప లాభాలను పొందగలుగుతారు. పెద్దల సలహాలు తీసుకుని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టండి. మొండి వైఖరి వల్ల కొన్ని బంధాలకు దూరం కావాల్సి వస్తుంది.
కర్కాటక రాశి: సొంత నిర్ణయాలు పనికిరావు. ఆలోచనల్లో నిలకడ అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ పనైనా మొదలుపెట్టడం మంచిది. శారీరక సమస్యలు ఇబ్బంది పెడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అనవసర ఆలోచనలు చేయడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
సింహరాశి: ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రయత్నాలను మొదలు పెట్టవచ్చు. ఈరోజు ఈ రాశి వారు విలువైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఆదాయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయడం మంచిది.
కన్యారాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సంతానలేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
తులారాశి: ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.
వృశ్చిక రాశి: కుటుంబంలోని అవివాహితులకు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. శ్రమ ఎక్కువైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి దరిచేరనీయరాదు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాళ్ల నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి: కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు.
మకర రాశి: మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగాల వారికి ఉన్నత పదవి లాభ సూచనలు ఉన్నాయి. ప్రమాదం అనుకునే ఏ పని చేయరాదు. మాటల్లో పొదుపు పాటించడం మంచిది. అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరాదు.
కుంభరాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయత్నానికి తొలి అడుగు పడుతుంది.
మీన రాశి: ఇంటి పెద్దల్లో ఒకరి అనారోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. మీకు ఇష్టమైన వారు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. తీవ్రంగా శ్రమించినప్పటికీ వ్యాపారులు నష్టాలను చవి చూస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల విధేయతగా ఉండాలి.