పంచాంగం
తేదీ 08 – 08 – 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:44 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:32 గంటలకు.
తిథి: శుక్ల చవితి రా. 9.33 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తర రా. 10.11 వరకు, తదుపరి హస్త.
దుర్ముహూర్తం: ఉ. 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి ప.2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అదృష్ట కాలం. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం. మార్కెటింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేసే వారికి శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచాలి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆహారంలో నియమాలు పాటించాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఒత్తిడితో కూడుకున్న రోజు. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల జోక్యంతో వివాదం పరిష్కరించుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు నష్టాలను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.
మిథున రాశి: ఈరోజు సాధారణంగా ఉంటుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులను తోబుట్టువుల సాయంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి: కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులు స్థానచలనంతోపాటు ప్రమోషన్ లు అందుకుంటారు. కుటుంబంలో చాలా కాలంగా నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు పెరుగుతాయి అయినప్పటికీ రుణాలు చేయడం మానుకోవాలి.
సింహరాశి: ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడటం నష్టాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారులు భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. మోసపోయే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి లేకపోతే విభేదాలు జరిగే అవకాశం ఉంది.
కన్యా రాశి: మీ అధిపత్య ధోరణి కుటుంబ సభ్యులను బాధిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందేందుకు వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. స్నేహితుల నుంచి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి: ఒత్తిడితో కూడుకున్న రోజు. పని భారం ఎక్కువవుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. సహనంతో వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది.
వృశ్చిక రాశి: సోమరితనం విడిచిపెట్టి ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్య ధోరణి వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి: కుటుంబంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటి పెద్దల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకర రాశి: జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. కుటుంబ సభ్యుల నుంచి నిరుత్సాహకరమైన వార్తలను వినవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో సహనంతో ఉండాలి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి: మిశ్రమ కాలం. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు నిర్లక్య ధోరణి విడిచి పెట్టాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు.