పంచాంగం
తేదీ 08-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: శుక్ల ఏకాదశి రా. 11.21 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆశ్లేష ఉ 10.28 వరకు, తదుపరి మఖ
శుభ సమయం: సా 5.02 నుంచి 6.02 వరకు
దుర్ముహూర్తం: ప 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి రా 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ప 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అనవసర కలహాలు కలుగుతాయి.
వృషభ రాశి: మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. తీవ్రంగా శ్రమించినప్పటికీ ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది.
మిధున రాశి: ఆర్థికంగా అదృష్ట కాలం నడుస్తోంది. ఈ సమయంలో పొదుపు ప్రారంభించడం చాలా మంచిది. వ్యాపారులకు అనూహ్య ధన లాభం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.
కర్కాటక రాశి: భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
సింహరాశి: కష్టకాలం. ఆర్థికపరంగా కొద్ది రోజులు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఆర్థిక వ్యవహారాలను ఎవరికి అప్పజెప్పొద్దు. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేయటం మంచిది. ఈ సమయంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది.
కన్య రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. ఫలితంగా ఇబ్బందుల్లో పడతారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారులకు తీవ్రంగా శ్రమిస్తే గాని ఆశించిన ఫలితాలు దక్కవు. కుటుంబ సభ్యుల మధ్య అనవసర విభేదాలు తలెత్తుతాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి.
తులారాశి: విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది నూతన వస్తూ వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తగిన ఆహార నియమాలు పాటించాలి. నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ధనస్సు రాశి: వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. డబ్బు పొదుపు చేసుకోవడానికి అనుకూల సమయం. శ్రమ కు తగ్గ ఫలితం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు.
మకర రాశి: కుటుంబంలో అనవసర కలహాలు ఏర్పడతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. రుణాలు చేసే పరిస్థితి తలెత్తుతుంది. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. ఉద్యోగులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు.
కుంభరాశి: ఆర్థికంగా అనుకూల సమయం. మొండి బకాయిలు వసూలు అవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
మీన రాశి: వ్యాపారులకు అదృష్ట కాలం. అనూహ్య ధన లాభం కలుగుతుంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టండి. సంతానం లేని వారికి శుభవార్తలు అందుతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న స్థిరాస్తి సమస్యలు ఈరోజు కొలిక్కి వస్తాయి. ఆత్మ మరియు విశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.