పంచాంగం
తేదీ 07- 09 – 2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల చవితి ప. 1.41 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: చిత్త ఉ 10.28 వరకు, తదుపరి స్వాతి.
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
శుభ సమయం: ఉ 10.30 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అన్నింట అనుకూల ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి: అనుకూల సమయం. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
మిథున రాశి: కుటుంబ సభ్యుల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.
కర్కాటక రాశి: బంధుమిత్రుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో నెలకొన్న ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ విముక్తి కలుగుతుంది. మొండి బకాయిలు వసూవులవుతాయి.
సింహరాశి: తీవ్రంగా శ్రమించి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పనుల్లో అలసత్వం పనికిరాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి: బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.
తులారాశి: అదృష్ట కాలం. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పిల్లల అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆహార నియమాలు పాటించాలి. ఉదర సంబంధిత అనారోగ్యం బాధిస్తుంది. చంచల స్వభావాన్ని దరిచేరనీయకుండా ఉండాలి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. ఏ పనైనా కుటుంబ సభ్యులతో చర్చించి మొదలుపెట్టడం మంచిది.
ధనస్సు రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అపరిచిత వ్యక్తులతో మిత సంభాషణ మంచిది.
మకర రాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు. ఇంటి సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సత్ప్రవర్తన తో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బుద్ధి బలంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
కుంభరాశి: వ్యాపారులకు లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.
మీన రాశి: మిశ్రమకాలం. ఏ పనైనా కుటుంబ సభ్యులతో చర్చించి మొదలుపెట్టడం మంచిది. సొంత నిర్ణయాలు సమస్యలను తెచ్చి పెడతాయి. ఏమరపాటు పనికిరాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల సాయం అందుతుంది.