పంచాంగం
తేదీ 07-10-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:46 గంటలకు.
తిథి: శుక్ల పంచమి పూర్తిగా..
నక్షత్రం: అనురాధ రా. 11.47 వరకు, జ్యేష్ట
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, సా. 2.46 నుంచి 3.34 వరకు
శుభ సమయం: ఉ. 6.00 నుంచి 7.00
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: సవాలుతో కూడుకున్న సమయం. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామి ఉదర సంబంధిత అనారోగ్యంతో బాధపడతారు. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
వృషభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. కొద్దిపాటి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో విభేదించడం వల్ల సంబంధ బంధవ్యాలు దెబ్బతింటాయి. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వివాదాలకు దూరంగా ఉండాలి.
కర్కాటక రాశి: వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కీలక సమయాల్లో తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
సింహరాశి: మిశ్రమకాలం. సంతాన లేమితో బాధపడుతున్న వారు శుభవార్తలు వింటారు. వ్యాపారులు నూతన ప్రాజెక్టులు చేజేక్కించుకుంటారు. కీలక సమయాల్లో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోవాల్సి రావచ్చు.
కన్యా రాశి: అదృష్ట కాలం. గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు ఫలితంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి అనుకూల సమయం. దీర్ఘకాలికంగా నెలకొన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు.
తులారాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో చేసిన పొరపాటు ఈరోజు బయటపడటం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల పొరపాట్లు జరుగుతాయి. ఫలితంగా సమస్యలు ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. పిల్లలు కంటి సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. నిర్లక్ష్యం చేయరాదు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగాల వారు ప్రత్యర్థుల చేతులు మోసపోయే ప్రమాదం ఉంది.. కావున ఎవరినీ నమ్మి వ్యక్తిగత విషయాలు పంచుకోరాదు. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: చేపట్టిన పనులు పూర్తి చేయడంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారికి ఈరోజు అనుకూల సమయం. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగుల మద్దతు లభించడం వల్ల ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు.
కుంభరాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మీన రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యల్లో పడతారు. ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది.