పంచాంగం
తేదీ 07-03-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:06 గంటలకు.
తిథి: శుక్ల అష్టమి మ. 1.41 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: మృగశిర తె 3.19 వరకు, తదుపరి నవమి
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ. 12.48 నుంచి 1.36 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ఉ 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూల సమయం నడుస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి సరైన సమయం. అనుభవజ్ఞుల సమక్షంలో పొదుపు ప్రారంభించండి. మంచే జరుగుతుంది. సానుకూల దృక్పథంతో ఉండండి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభ రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. అనవసర ఆలోచనలు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.
మిథున రాశి: భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ఇతరులతో సంభాషించాలి. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆప్తులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలే మిగులుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు.
కర్కాటక రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఊహించని ధన లాభం కలుగుతుంది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది.
సింహ రాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది.. మీది కాని వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. వివాదాలకు తావివ్వకండి. బంధువులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. వ్యాపార సంబంధ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి రావచ్చు.
కన్యారాశి: మిశ్రమ కాలం. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు పాటించండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వివాదాలను పరిష్కరించుకోండి.
తులారాశి: ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనశ్శాంతిని తగ్గించే పనులకు దూరంగా ఉండండి. అనుకున్న ఫలితాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో మోసపోయే ప్రమాదం. పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తొందరపాటు నిర్ణయాల వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది.
వృశ్చిక రాశి: మిశ్రమకాలం. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తవుతాయి. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ సాయాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి.
ధనస్సు రాశి: చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
మకర రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడతారు. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఈరోజు జరపకపోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.
కుంభరాశి: ఆప్తులతో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అవసరానికి డబ్బు సాయం అందుతుంది.
మీన రాశి: మిశ్రమకాలం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.