పంచాంగం
తేదీ 07-01-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, పుష్య మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:36 గంటలకు.
తిథి: శుక్ల అష్టమి 4.37 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: రేవతి సా. 6.23 వరకు తదుపరి అశ్విని
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12వరకు, తిరిగి రా. 10.46 నుంచి 11.36 వరకు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి : ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. చంచల మనస్తత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అప్పులు చేయాల్సి రావచ్చు. బంధుమిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి.
వృషభ రాశి: అదృష్ట కాలం. నూతన వ్యాపారాలు చేపట్టాలనుకునే వారికి అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. పూర్వికుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
మిథున రాశి: కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. గతంలో పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అనుకూల సమయం.
కర్కాటక రాశి: మిశ్రమకాలం. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వారు కోరుకున్నచోట స్థానచలనం లభిస్తుంది. వ్యాపారులు లాభాలు రాబట్టుకోవడానికి స్వల్పంగా శ్రమించాల్సి ఉంటుంది.
సింహరాశి: ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మనోబలంతో వాటిని ఎదుర్కోవాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోవద్దు. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపకండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఆలోచించుకుని ఇవ్వండి.
కన్యా రాశి: మనశ్శాంతిని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు అందుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
తులారాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించేందుకు ప్రయత్నించండి.
వృశ్చిక రాశి: బంధుమిత్రుల నుంచి అందిన వార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి: శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల వినయంగా ప్రవర్తించండి. పని ప్రదేశంలో కొంత చికాకు ఉంటుంది. సహోద్యోగుల మద్దతు కరువు అవుతుంది.
మకర రాశి: వ్యాపారులు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో ఎటువంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.
కుంభరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఉద్యోగులకు పై అధికారుల మందలింపు ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చంచల మనస్తత్వం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
మీన రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను అమల్లో పెట్టొచ్చు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య నుంచి బయటపడతారు.
