పంచాంగం
తేదీ 07-12-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:27 గంటలకు.
తిథి: శుక్ల షష్ఠి ఉ 9.30 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: ధనిష్ట సా. 4.00 వరకు, తదుపరి శతభిషం
శుభసమయం: సా 5.00 నుంచి 6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ప.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ 1.30 నుంచి 3.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. కంటి సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. చాలాకాలం తర్వాత చిన్ననాటి మిత్రుని కలుసుకొని సంతోషంగా గడుపుతారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు.
వృషభ రాశి: మిశ్రమంగా ఉంటుంది. కొత్త పనులపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు తమ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు వారికి చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు కొందరి ప్రవర్తనతో కలత చెందుతారు. నమ్మినవారే మోసం చేయాలని చూస్తారు.
మిథున రాశి: అనుకూల సమయం. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవీ లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. నూతన గృహ యోగ సూచనలు ఉన్నాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిరకాల కోరికను కుటుంబ సభ్యుల సహకారంతో నెరవేర్చుకుంటారు.
కర్కాటక రాశి: దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.
సింహరాశి; కష్టకాలం. అనుకోని సమస్యలు చుట్టూ ముడతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వ్యాపారులు వాయిదా వేయడం మంచిది. ఎంత శ్రమించినప్పటికీ నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అరువు తెచ్చుకున్న వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది.
కన్యా రాశి: అనుకూల సమయం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. పొదుపు చేయడానికి సరైన సమయం. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు.
తులారాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎవరితోనూ వాగ్వాదానికి దిగరాదు. కుటుంబ సభ్యుల మధ్య అనుస్పర్ధలు ఏర్పడతాయి. సహనంతో వాటిని పరిష్కరించాలి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు.
వృశ్చిక రాశి: మిశ్రమంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. వ్యాపారంలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. ఉద్యోగులకు పని భారం ఎక్కువవుతుంది. పనులపై ఏకాగ్రత పెట్టలేక పోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.
ధనస్సు రాశి: కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యేవారు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
మకర రాశి: కష్టకాలం. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. సమస్యలు చుట్టుముడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల ప్రయత్నాలను అడ్డుకోలేకపోవడం వల్ల సమస్యల్లో పడతారు. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కుంభరాశి: కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త ఆనందాన్నిస్తుంది. అనవసర తగాదాలతో కలత చెందుతారు. కొన్ని సందర్భాల్లో ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. రుణ దాతల ఒత్తిడి పెరుగుతుంది.
మీన రాశి: మిశ్రమకాలం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఒప్పందాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ఆలోచనల్లో నిలకడ ఉండాలి. చంచల మనస్తత్వం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.