పంచాంగం
తేదీ 07 – 08 – 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం, వర్ష ఋతువు
సూర్యోదయం: ఉదయం 5:4 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:32 గంటలకు
తిథి: శుక్ల తదియ రా.7.36 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: పుబ్బ రా. 7.38 వరకు, తదుపరి ఉత్తర
దుర్ముహూర్తం: ఉ. 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: సా. 4.00 నుంచి 5.00 వరకు
రాహుకాలం: ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. తోబుట్టువుల మద్దతు ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఉద్యోగులు నిర్లక్ష్య ధోరణి వల్ల పై అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు.
వృషభ రాశి: ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి మనోభావాలను గౌరవించాలి. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
మిథున రాశి: ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మొండి బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారులకు ముఖ్యమైన ప్రాజెక్టులు చేజిక్కుతాయి. కుటుంబ సభ్యుల వివాదంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొన్ని సమయాల్లో సహనంతో వ్యవహరించాలి.
కర్కాటక రాశి: వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సమయస్ఫూర్తితో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు.
సింహరాశి: ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు. స్థాన చలనంతో పాటు ఇంక్రిమెంట్లు పదోన్నతులు అందుకుంటారు. న్యాయపరమైన కేసుల్లో పై చేయి సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.రాజకీయ రంగాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. వారిని ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి.
కన్యారాశి: చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రయాణాలు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. విదేశీ విద్యనుభ్యసించాలనుకునే వారికి నూతన అవకాశాలు అందుతాయి.
తులారాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు అందుతాయి. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. బాధ్యతలను సకాలంలో నెరవేర్చాలి.
వృశ్చిక రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. ఉదర సంబంధ అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. జీవిత భాగస్వామి సలహాలను పాటించండి. తండ్రిని కంటి సంబంధ అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆస్తి విషయంలో కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారులకు నూతన ప్రాజెక్టులు అందుతాయి. సమస్పూర్తితో ప్రశంసలు పొందుతారు.
మకర రాశి: శుభకాలం. ఉద్యోగులకు ప్రమోషన్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న అపార్ధాలు తొలగిపోతాయి. వ్యాపార భాగస్వామి సమయస్ఫూర్తి వల్ల నష్టాల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతుంది.
కుంభరాశి: అదృష్ట కాలం. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన పని ఈరోజు పూర్తవుతుంది. స్థానచలనం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
మీన రాశి: జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపడం ద్వారా మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల పట్ల ప్రేమగా మెలగాలి. వివాదాల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. వ్యాపారులు గణనీయమైన లాభాలు పొందుతారు. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.