Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 06 మార్చి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,608FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 06-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి మ. 3.39 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: రోహిణి తె 4.24 వరకు, తదుపరి మృగశిర
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ. 2.48 నుంచి 3..36 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: మిశ్రమ కాలం. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. స్వశక్తిని నమ్ముకోవడం మంచిది. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. సానుకూల దృక్పథంతో ఉండండి. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుతుంది.

వృషభ రాశి: ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దీర్ఘకాలికంగా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనూహ్యమైన ధనలాభం ఉంది.

మిథున రాశి: చాలాకాలం తర్వాత ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడపగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను అమల్లో పెట్టొచ్చు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి: ఊహించని ధన లాభం ఉంది. బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహరాశి: మీ అధికార పరిధి పెరుగుతుంది. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

కన్యారాశి: రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. చిలక సమయాల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఇంటి పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

తులారాశి: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు నొచ్చుకునే ప్రమాదం ఉంది. మీది కానీ వ్యవహారంలో తల దూర్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల్లో పడతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు మరింత తీవ్రమవుతాయి.

వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అరువు తెచ్చుకున్న వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండండి.

ధనస్సు రాశి: మిశ్రమ కాలం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఈరోజు జరపకపోవడం మంచిది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు.

మకర రాశి: అలసట పెరుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. అరువు తెచ్చుకున్న వాహనాలు పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

కుంభరాశి: అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మీన రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా ఊహించని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.

సినిమా

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

Daily Horoscope: సింహకు కొత్త అవకాశాలు.. ధనుస్సుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు

మే 17 , 2026 ఆదివారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం,...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....