పంచాంగం
తేదీ 06-06-2024, గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు
సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు
తిథి: అమావాస్య సాయంత్రం 5:44 వరకు, తదుపరి పాడ్యమి
నక్షత్రం: రోహిణి రాత్రి 8:37 వరకు తదుపరి మృగశిర
దుర్ముహూర్తం: ఉదయం 10:00 నుంచి 10:48 వరకు తిరిగి 2:48 నుంచి 3:36 వరకు
శుభ సమయం: లేవు
రాహుకాలం: ప. 1:30 నుంచి 3:00 వరకు
యమగండం: 6:00 నుంచి 7:30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలి. అయినవారే తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు.
వృషభ రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన తో కలత చెందుతారు. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి బదిలీ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి: ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు మాటలు పడాల్సి రావచ్చు. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
కర్కాటక రాశి: భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాన్ని మెరుగుపరుచుకుంటారు. తండ్రితో స్వల్ప వాగ్వాదం కారణంగా మనస్థాపం చెందుతారు. మీ మంచితనాన్ని ఇతరులు బలహీనతగా తీసుకొని మోసం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుతుంది.
సింహరాశి: తోబుట్టులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇతరుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు సమస్యలను తెచ్చిపెడతాయి. గతంలో చేసిన రుణాలను తీర్చడానికి అనువైన సమయం.
కన్యా రాశి: చెప్పుడు మాటలు వినడం వల్ల కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి: దూర ప్రయాణాలు లాభిస్తాయి. తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పని ఈరోజు పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరం.
వృశ్చిక రాశి: ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. పని పట్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల వాయిదా పడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. వ్యాపార లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తోబుట్టువులతో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల మొండి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రాపర్టీ డీల్ ఈరోజు ఖరారు అవుతుంది.
మకర రాశి: అనుకూల సమయం. వ్యాపారం విస్తరణ చేయాలనుకునే వారికి శుభకాలం. సకాలంలో పని పూర్తి చేయకపోతే అధికారుల ఆగ్రహానికి గురవుతారు. పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
కుంభరాశి: ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి రావడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మీన రాశి: కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టకపోవడం వల్ల అధికారుల ఆగ్రహానికి గురవుతారు. పని ఎక్కువ ఉన్నప్పటికీ ఒత్తిడికి లోను కావద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
