పంచాంగం
తేదీ 06-12-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు.
తిథి: శుక్ల పంచమి ఉ 10:54 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం: శ్రవణం సా. 4.50 వరకు, తదుపరి ధనిష్ట
శుభ సమయం: సా 5.00 నుంచి 6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి మ 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ప.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: మిశ్రమ కాలం. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోనూ మనస్పర్ధలు వస్తాయి. తీవ్రంగా శ్రమించి వ్యాపారులు స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక సంఘటన మనస్థాపానికి గురిచేస్తుంది.
వృషభ రాశి: ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు.
మిథున రాశి: మిశ్రమ కాలం. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనుకోని సమస్యలు చుట్టుముడతాయి. అయినప్పటికీ మనో బలంతో వ్యవహరించి వాటిని పరిష్కరించగలుగుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యుల సహాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అద్భుతమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువును ఈరోజు పొందగలిగే అవకాశం ఉంది.
సింహరాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి వ్యాపారులు లాభాలను పొందుతారు.
కన్యా రాశి: అయిన వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేయాల్సి రావచ్చు. ఆ సమయంలో సంయమనం పాటించడం మంచిది. సహనాన్ని పరీక్షించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓపికగా ఉండాలి. మీ మాటలకు ఇతరులు నొచ్చుకునే ప్రమాదం ఉంది.
తులారాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలోనూ కొంత ఇబ్బందికర వాతావరణ ఉంటుంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల వివాదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. ఉద్యోగులకు అనుకోని ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.
ధనస్సు రాశి: మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో విభేదించాల్సి రావచ్చు. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల అనుకోని ఖర్చులు ఏర్పడతాయి ఫలితంగా రుణాలు చేయాల్సి రావచ్చు. రుణ దాతల ఒత్తిడి కూడా కొంత ఎక్కువవుతుంది.
మకర రాశి: అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి విశేషమైన రోజు. సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కలకు తొలి అడుగు పడుతుంది. కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభరాశి: అదనపు బాధ్యతల వల్ల అలసట పెరుగుతుంది. పెద్దల మాటను అనుసరించి ఏ పనైనా మొదలు పెట్టడం మంచిది. కొన్ని ముఖ్య సమయాల్లో స్నేహితుల సలహాను పాటించండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాలు చేయకుండా ఉండటం మంచిది.
మీన రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.