పంచాంగం
తేదీ 05- 09 – 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:50 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: విదియ ఉ 9.37 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: హస్త పూర్తిగా
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి ప. 2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ఒక సమస్య నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. నూతన వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.
వృషభ రాశి: నమ్మినవారే మోసం చేసి ప్రమాదం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో మిత సంభాషణ మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అనవసర విషయాల్లో తల దూర్చకుండా ఉండటం మంచిది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.
కర్కాటక రాశి: స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే ఈ రాశి వారికి అనుకూల సమయం. పూర్వీకుల ఆస్తి సంబంధ వివాదాలు తొలగిపోతాయి. నూతన వస్తూ, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహరాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. రుణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వ్యాపారులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి.
కన్యారాశి: దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు చర్చల ద్వారానే తెలంగాణ చర్చల ద్వారా పరిష్కారమవుతాయి.
తులారాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది.ఆప్తుల సహాయంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు అంచనాలకు మించి విజయవంతం అవుతాయి. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు అందుతాయి. కోర్టు కేసులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.
ధనస్సు రాశి: అదృష్ట కాలం. ఇష్టమైన వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు విశేషమైన లాభాలు అందుకుంటారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి.
మకర రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆప్తులతో కలహ సూచన ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో మనస్పర్ధలు పెరుగుతాయి. సహనంతో వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కష్టాలు ఎదురవుతాయి. మానసిక విచారం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.
కుంభరాశి: ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. మనో బలంతో అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. మొహమాటంతో కొన్ని సమస్యల్లో పడతారు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పై అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మీనరాశి: శుభకాలం. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. మనశ్శాంతిని చేకూర్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో రుణాలు చెల్లించగలుగుతారు. మీ ప్రతిభతో ప్రశంసలు పొందుతారు.
Quality articles or reviews iss the maion to intsrest the people too vjsit the webb site, that’s
what this website is providing.