పంచాంగం
తేదీ 05-12-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు
తిథి: శుక్ల చవితి ఉ 11.54 వరకు, తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తరాషాడ సా. 5.18 వరకు, తదుపరి శ్రవణం
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
వృషభ రాశి: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది.
మిధున రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనికోసం ఎవరిమీద ఆధారపడరాదు. పనుల్లో జాప్యం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఒక విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేయాలనుకునే వ్యాపారులు కాస్త ఓపిక పట్టడం మంచిది. పెట్టుబడి పెట్టేందుకు ఇది అనుకూల సమయం కాదు.
కర్కాటక రాశి: బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారులు తీవ్రంగా శ్రమించి స్వల్ప లాభాలను పొందగలుగుతారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు.
సింహరాశి: ప్రతిభతో ప్రశంసలు దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. కుటుంబంలోని అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది.
కన్యా రాశి: కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు. పెద్దలతో కాస్త సంయమనం తో మాట్లాడటం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు కొనసాగుతాయి.
తులారాశి: మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా వ్యాపారులు గణనీయమైన లాభాలను పొందగలుగుతారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ముందు చూపుతో వ్యవహరించి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు రాశి: భయభ్రాంతులకు గురిచేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రమాదం అనుకునే ఏ పని చేయరాదు. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు జరుగుతాయి. ఎవరితోనూ వాదన పెట్టుకోరాదు. ముఖ్యమైన పనులన్నీ వాయిదా పడతాయి.
మకర రాశి: కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది ఆర్థిక సంబంధ లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభరాశి: మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ధనవ్యయం కలుగుతుంది. అతిగా నమ్మిన వారి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. మాటల్లో సంయమనం పాటించాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు కొనసాగుతాయి.
మీన రాశి: చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. ఇంటా బయట పై చేయి సాధిస్తారు. అందర్నీ కలుపుకొని పోవడం ద్వారా ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.