Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 05 జూలై 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:34
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ శుద్ధ షష్ఠి మ.3:02 వరకు తదుపరి ఆషాఢ శుద్ధ సప్తమి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: పుబ్బ ఉ.7:16 వరకు తదుపరి ఉత్తర
యోగం: వ్యతీపాత ఉ9:51 వరకు తదుపరి వరీయాన్
కరణం: తైతుల మ. 2:51 వరకు
దుర్ముహూర్తం : ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి రా.10:46 నుండి 11:36 వరకు
వర్జ్యం : మ.2:48 నుండి సా.4:27 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి .10:30 వరకు
గుళికా కాలం :మ.12:20 నుండి 1:58 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:14 నుండి 5:02 వరకు
అమృతఘడియలు: రా.12:36 నుండి రా.1:15 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:54 నుండి మ.12:46 వరకు

ఈరోజు. (05-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం: ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. సహోద్యోగులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మిథునం: దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది.

సింహం: ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

కన్య: సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

తుల: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు.

వృశ్చికం: గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి.

ధనస్సు: ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం: నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

కుంభం: వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

మీనం: వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్...

అన్న సక్సెస్‌.. తమ్ముడు ఫుల్‌ హ్యాపీ

నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్‌...

బింబిసార మళ్లీ వస్తాడన్న కళ్యాణ్‌ రామ్‌

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన...

రాజకీయం

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తెలంగాణ భళా.! ఆంధ్రప్రదేశ్ డీలా.!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో...

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో లీక్.! అటువైపు వున్న మహిళ ఎవరు.?

బులుగు బాగోతం బయటపడినట్లేనా.? ఇంకా మార్ఫింగ్ బుకాయింపు కొనసాగుతుందా.? ‘అది ఫేక్’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారాన్ని వైసీపీ నాన్చబోతోందా.? ‘కఠిన చర్యలు’ అంటూ మీడియాకి లీకులు...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్ = అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న దశలో ఆయన ఇమేజ్, క్రేజ్ అది....

రవితేజ టైగర్ నాగేశ్వరరావులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు!

హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ భారీ ప్లాప్ గా మిగులుతోంది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా...

బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ వాయిదా

బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా తెరకెక్కిన 'స్వాతిముత్యం' చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నిర్ణయం పట్ల యూనిట్‌ సభ్యులు సంతోషంగా...

అల్లు శిరీష్‌ మరో జాతిరత్నం!

అల్లు అర్జున్‌ హీరోగా పాన్ ఇండియా స్థాయి లో దూసుకు పోతూ ఉంటే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దశాబ్ద కాలంగా టాలీవుడ్‌...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనను ఆవిష్కృతం చేసిన ‘స్వయంకృషి’

చిరంజీవికి వచ్చిన మాస్ ఇమేజ్ తో నెంబర్ వన్ హీరోగా.. మెగాస్టార్ గా తెలుగు సినిమాను ఏలేశారు. డ్యాన్స్, ఫైట్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో నట విశ్వరూపాన్ని చూపే సినిమా చేశారు....