పంచాంగం
తేదీ 04- 10 – 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:51 గంటలకు.
తిథి: శుక్ల విదియ తె 2.40 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: చిత్త సా.5.34 వరకు తదుపరి స్వాతి
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 12.24 నుంచి 1.12 వరకు
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ.3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: బాధ్యతలు పెరుగుతాయి. మీ పనిని పక్కన పెట్టి ఇతరుల కోసం పనిచేస్తారు. ఫలితంగా సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన తో కలత చెందుతారు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. పెద్దవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మాటల్లో పొదుపు పాటించడం మంచిది. కొన్ని విషయాల్లో సంయమనం పాటించక తప్పదు. మీ సంభాషణను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులు నిపుణులను సంప్రదించడం మంచిది.
మిధున రాశి: న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. మిత సంభాషణ మంచిది. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. పూర్వీకుల ఆస్తి సంబంధ విషయాల్లో పై చేయి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
కర్కాటక రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులో గణనీయమైన లాభాలను పొందుతారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
సింహరాశి: వ్యాపారంలో ఏవైనా మార్పులు చేదల్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు. తల్లిదండ్రుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనుకోకుండా చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కానీ గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోకపోవడం మంచిది.
కన్య రాశి: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని లాభాలు అందుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సత్ప్రవర్తనతో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి.
తులారాశి: ఈరోజు వారు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు పని భారం ఎక్కువవుతుంది. ఫలితంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి: అదృష్ట కాలం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. పురోగతిలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు ఈరోజు అనువైన సమయం.
ధనస్సు రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం. పనుల్లో జాప్యం కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఆప్తులతో విభేదించాల్సి రావచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ఆలోచనల్లో నిలకడ అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఏ పనైనా మొదలు పెట్టడం మంచిది.
మకర రాశి: మిశ్రమ కాలం. సత్ప్రవర్తనతో సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. రాజకీయ రంగాల వారికి నూతన పదవీ బాధ్యతలు అందుతాయి. సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి వ్యక్తిగత విషయాలు పంచుకోరాదు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
కుంభరాశి: మిశ్రమకాలం. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి తొలి అడుగు పడుతుంది. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
మీన రాశి: అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరాదు. ఎవరిని అతిగా నమ్మి వ్యక్తిగత సమాచారం పంచుకోరాదు. ఉద్యోగులు యజమానుల తో జాగ్రత్తగా సంభాషించాలి. ఆలోచనల్లో నిలకడ అవసరం. కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించాల్సి వస్తుంది. ఇంటి పెద్దలతో విభేదించాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు తీవ్రమవుతాయి.