పంచాంగం
తేదీ 04-06-2024, మంగళవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు
సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు
తిథి: బహుళ త్రయోదశి రాత్రి 9.00 వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం: భరణి రా.10.39 వరకు, తదుపరి కృత్తిక
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.12 వరకు తిరిగి 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: పగలు. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: 9.00 నుంచి 10.30 వరకు.
రాశి ఫలాలు
మేష రాశి: అదృష్ట కాలం. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామి కోసం స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు పొందుతారు.
వృషభరాశి: విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. అడ్డంకులు తొలగి ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు.
మిథున రాశి: ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. శిరస్సుని కొనుగోలు చేయాలన్న కల నెరవేరుతుంది. తోబుట్టువుల వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
కర్కాటక రాశి: అనవసర ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందులు పడతారు. వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కాస్త ఆలోచించడం మంచిది.
సింహరాశి: సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తరపు బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి.
కన్యా రాశి: వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం వల్ల నష్టాలు దూరమవుతాయి. పనుల్లో తొందరపాటు పనికిరాదు.
తులారాశి: కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కృష్ణ సమయాల్లో స్నేహితుల సహకారం అందుతుంది.
వృశ్చిక రాశి: ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనస్సు రాశి: రాజకీయరంగంలో ఉన్న ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. బాగా నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. పాత స్నేహితులని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: మిశ్రమకాలం. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
కుంభ రాశి: పనుల్లో జాప్యం కలిగినప్పటికీ పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. కీలక సమయాల్లో కుటుంబ పెద్దల సలహా ఉపయోగపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.
మీన రాశి: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తొందరగా అలసటకు గురవుతారు. అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాల్లో తీసుకున్న నిర్ణయాల పట్ల పునరాలోచన చేయడం ఉత్తమం.
