పంచాంగం
తేదీ 04-12-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు.
తిథి: శుక్ల తదియ ప. 12.26 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: పూర్వాషాఢ సా. 5.20 వరకు, తదుపరి ఉత్తరాషాడ
శుభ సమయం: ఉ 9.00 నుంచి 10.00 వరకు
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: మిశ్రమకాలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చుల వల్ల రుణాలు చేయాల్సి రావచ్చు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తల్లి సలహా తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనను వాయిదా వేయడం మంచిది.
వృషభ రాశి: తల్లిదండ్రుల మద్దతుతో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. తోబుట్టులు సాయం అందిస్తారు. ఆప్తులతో అకారణంగా విభేదించాల్సి రావచ్చు. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటమే మంచిది.
మిథున రాశి: రాజకీయాల్లో స్థిరపడాలనుకునే ఈ రాశి వారికి తొలి అడుగు పడుతుంది. అందర్నీ కలుపుకొని పోవాలి. అదనపు బాధ్యతలు ఒత్తిడిని పెంచుతాయి. గిట్టని వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం.
కర్కాటక రాశి: సంపద పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. సమయానుకూలంగా వ్యవహరించి ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. గతంలో పోగొట్టుకున్న వస్తువును ఈరోజు తిరిగి పొందే అవకాశం ఉంది.
సింహరాశి: మిశ్రమకాలం. రక్త సంబంధాలు బలపడతాయి. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సమస్యలు తొలగించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి స్నేహితుడిని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి.
కన్య రాశి: అదృష్ట కాలం. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు.
తులారాశి: ఈరోజు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. కీలక సమయంలో తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పెద్దలు ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి.
వృశ్చిక రాశి: కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సామాజిక రంగంలో పనిచేసే వారు గుర్తింపు పొందుతారు. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆలోచనత్మకంగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల సహాయంతో పెద్ద సమస్య నుంచి బయటపడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి: కష్టకాలం. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలను పొందుతారు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు.చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు.
మకర రాశి: ఆదాయం, ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి. తగిన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అపార్ధాలు తలెత్తకుండా ఆలోచనత్మకంగా సంభాషించాలి. కుటుంబ సభ్యుల సమస్యలు తగ్గించడానికి సానుకూలంగా చర్చించాల్సి ఉంటుంది. చేసే పనిపై దృష్టి పెడితే మెరుగైన లాభాలు పొందగలరు.
కుంభరాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నూతన వ్యాపారం మొదలు పెట్టాలనుకునే ఈ రాశి వారికి అనుకూల సమయం. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశి వారికి కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉంటాయి. తీవ్రంగా శ్రమించి ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. పిల్లలతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. మీ సమస్యల్లోకి మూడో వ్యక్తి ప్రమేయం తీసుకోరాదు.