Switch to English

రాశి ఫలాలు: సోమవారం 04 జూలై 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:34
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ శుద్ధ పంచమి సా.2:37 వరకు తదుపరి ఆషాఢ శుద్ధ షష్ఠి
సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం)
నక్షత్రము: మఘ ఉ.6:00 వరకు తదుపరి పుబ్బ
యోగం: సిద్ధి ఉ.10:26 వరకు తదుపరి వ్యతిపాత
కరణం: బాలవ మ.2:22 వరకు
దుర్ముహూర్తం : మ.12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.2:26 నుండి 3:34 వరకు
వర్జ్యం : మ.2:25 నుండి సా.4:06 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
గుళికా కాలం :మ.1:58 నుండి 3:35 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:14 నుండి 5:02 వరకు
అమృతఘడియలు: రా.12:36 నుండి రా.తె.2:17 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:54 నుండి మ.12:46 వరకు

ఈరోజు (04-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

వృషభం: వ్యాపార భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

మిథునం: అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

సింహం: ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థికంగా లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది.

కన్య: పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

తుల: సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధన ఆదాయం బాగుంటుంది ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చికం: దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు కలసివస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు: చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

మకరం: వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం: గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. రాజకీయవర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...