పంచాంగం:
తేదీ 03- 10 – 2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:51 గంటలకు.
తిథి: శుక్ల పాడ్యమి రా.12.44 వరకు, తదుపరి విదియ.
నక్షత్రం: హస్త ప 2.39 వరకు, తదుపరి చిత్త
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి 2.48 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ 6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలు రచిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోబుట్టువులతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. కీలక సమయాల్లో జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది. ఉద్యోగులు విధుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆప్తులతో కొద్దిపాటి విభేదాలు ఉంటాయి.
వృషభ రాశి: కుటుంబ సమస్యలు చుట్టుముట్టడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అధిక పని భారం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది. బంధుమిత్రులతో చిన్న చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడతాయి.
మిధున రాశి: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారంలో మార్పులు చేస్తారు. ఫలితంగా మంచి లాభాలను పొందుతారు. కీలక విషయాల్లో తోబుట్టువుల మద్దతు అవసరం. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్దలు తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వామి తో వీలైనంత సఖ్యతగా ఉండటం మంచిది.
కర్కాటక రాశి: నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో కలిసి వ్యాపారంలో ముందడుగు వేస్తారు. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పనుల్లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది.
సింహరాశి: మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు కలత చెందే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో సహనంతో వ్యవహరించాలి. ఇద్దరి మధ్య మాట పట్టింపులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. గందరగోళ పరిస్థితుల వల్ల పనులన్నీ వాయిదా పడతాయి. ఫలితంగా సమస్యలు ఏర్పడతాయి.
కన్యారాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ తిరగబడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సహోద్యోగుల నుంచి కీలక సమయాల్లో మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.
తులారాశి: ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపార అభివృద్ధి పై దృష్టి పెడతారు. ఆప్తులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సకాలంలో రుణాలు తీర్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది.
వృశ్చిక రాశి: పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏకకాలంలో అనేక పనులు చేయాల్సి రావచ్చు. శారీరకంగా అలసట పెరుగుతుంది. మానసిక అశాంతి ఎక్కువ అవుతుంది. గతంలో చేసిన పొరపాటు ఈరోజు బయటపడటం వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు కలత చెందుతారు. కీలక సమయాల్లో సంయమనం పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు.. సహనంతో ఉండాలి.
ధనస్సు రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వ్యాపార అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగార్దులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మకర రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం మంచిది. మీ మాటల వల్ల ఇతరులు నొచ్చుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా సంబంధబాంధవ్యాలు దెబ్బతింటాయి. ఆప్తుల నుంచి అందిన వార్త నిరుత్సాహపరుస్తుంది. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువును ఈరోజు తిరిగి పొందే అవకాశం ఉంది.
కుంభరాశి: అనుకూల సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుతో అధికారులను మెప్పించడం వల్ల ప్రమోషన్లు అందుకుంటారు. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి సమస్యలు తొలగిపోతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు అనుకూల సమయం.
మీన రాశి: చట్టపరమైన చిక్కుల్లో పడతారు. తొందరపడి ఎవరికీ మాట ఇవ్వరాదు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఆలోచించుకోవడం మంచిది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తల్లితండ్రుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్వల్పంగా ఖర్చులు పెరుగుతాయి.