Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 03 డిసెంబర్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,965FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 03-12-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు.
తిథి: శుక్ల విదియ ప 12.39 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: మూల సా 4.53 వరకు, తదుపరి పూర్వాషాఢ
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
దుర్ముహూర్తం: ఉ 08.24 నుంచి 9.12 వరకు తిరిగి రా. 10.48 నుంచి 11.36 వరకు
రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అనుకూల సమయం. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. నూతన వస్తు, వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృషభ రాశి: అనవసర ఆలోచనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసం రక్షిస్తూ ఉంటుంది. మీ ప్రవర్తనతో ఇతరులు కలత చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఒక విషయంలో విభేధించాల్సి వస్తుంది.

మిథున రాశి: ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బయటపడతారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు.

కర్కాటక రాశి: చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. తీవ్రంగా శ్రమిస్తే గాని పనులు పూర్తి కావు. అపరిచితులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. మోసపోయే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి: మిశ్రమకాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి గురవుతారు. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వాదం మంచిది కాదు. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి.

కన్యారాశి: అదృష్ట కాలం. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. సమయస్ఫూర్తితో ప్రశంసలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొని కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు.

తులారాశి: మిశ్రమకాలం. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. కీలక వ్యవహారాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదించరాదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరిని కోల్పోవాల్సి రావచ్చు.

వృశ్చిక రాశి: మిశ్రమకాలం. నిలకడ లేని ఆలోచనల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. చెడు పనులపై దృష్టి మల్లుతుంది. ఆప్తులతో కోపతాపాలకు పోరాదు. ఏ చిన్న విషయాన్ని అయినా కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తీవ్రమవుతాయి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

మకర రాశి: అదృష్ట కాలం. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విశేషమైన లాభాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొని కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు ఉంటుంది.

కుంభరాశి: అనుకూల సమయం. బుద్ధి బలంతో వ్యవహరించి ఒక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనరాశి: జాగ్రత్త గా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఉదర సంబంధ అనారోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆహార నియమాలు పాటించాలి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. ప్రత్యర్థుల కదిలికలను గమనిస్తూ ఉండాలి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది.

సినిమా

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను...

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను...

‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారెందుకంటే.!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ...

రాజకీయం

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

వైసీపీకి చావు దెబ్బ: కీలక నేతలు గుడ్ బై.! కార్యకర్తలు లబోదిబో.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన...

ఎక్కువ చదివినవి

ఆ రెండు సినిమాలతో ఎన్టీఆర్ కు బాలీవుడ్ మార్కెట్..!

టాలీవుడ్ నుంచి నేషనల్ వైడ్ గా మార్కెట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ పేరు మొన్నటి దాకా వినపడేది. పుష్ప-2తో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో మార్కెట్ ను సంపాదించుకున్నాడు. అయితే త్రిబుల్...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

కూటమి విజయం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.!

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త చెప్పింది. గతంలో విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టిన కేంద్రమే, ఇప్పుడు అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నడుం బిగించడం గమనార్హం. అప్పుడూ నరేంద్ర మోడీ...

‘గేమ్ ఛేంజర్’ ఇంపాక్ట్.! సమాజంపై ఆ స్థాయిలో.!

శంకర్ తెరకెక్కించే సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడంటే పాన్ ఇండియా.. అనే పేరు వాడుతున్నాంగానీ, శంకర్ దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా...

మంచు గొడవ.! మళ్ళీ మొదలైంది.!

మంచు కుటుంబంలో ఆస్తుల పంపకాల రగడ గురించి కొత్తగా చెప్పేదేముంది.? మోహన్‌బాబు, విష్ణు ఓ వైపు.. మనోజ్ ఇంకో వైపు.. వెరసి, ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో నడుస్తోంది. తనపై మనోజ్ హత్యాయత్నం చేశాడని...