పంచాంగం
తేదీ 02- 10 – 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:51 గంటలకు.
తిథి: అమావాస్య రా.10.33 వరకు తదుపరి పాడ్యమి
నక్షత్రం: పుబ్బ ఉ 9.54 వరకు, తదుపరి ఉత్తర ప. 12.22 వరకు
దుర్ముహూర్తం: ఉ 11.36 నుంచి 12.24 వరకు
శుభ సమయం: ఏమీ లేవు ఎందుకని
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ 7.30 నుంచి 9.00 ఉంది వరకు
రాశి ఫలాలు
మేష రాశి: బుద్ధిబలంతో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.
వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది.
మిథున రాశి: మిశ్రమకాలం. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్యం మళ్లీ తిరగబెడుతుంది. ఆహార నియమాలు పాటించాలి. బంధువుల నుంచి అందిన ఒక వార్తతో కలత చెందుతారు. ప్రత్యర్థుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కర్కాటక రాశి: అనుకూల సమయం. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. వ్యాపారులకు గణనీయమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సరైన సమయం. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
సింహరాశి: అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతాయి. నిర్లక్ష్యం దరిచేరనీయరాదు. ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
కన్య రాశి: శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనుల విషయంలో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోరాదు. కుటుంబ సభ్యులతో విభేదించాల్సి రావచ్చు.సహనంతో వ్యవహరించడం మంచిది. రుణాలు చేయాల్సి రావచ్చు.
తులారాశి: శుభ సమయం. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్తలు అందుకుంటారు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి.
వృశ్చిక రాశి: తోటి వారిని కలుపుకుని పోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులున్నప్పటికీ అందుకు తగిన ఆదాయం అందుతుంది. చేపట్టే పనుల్లో ఆటంకం లేకుండా చూసుకోవాలి. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. వ్యాపారులు భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.
ధనస్సు రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి.
మకర రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొన్ని సంఘటనల వల్ల కలత చెందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభరాశి: అనుకూల సమయం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనరాశి: శుభకాలం. ఉద్యోగులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ వనరులను పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.