పంచాంగం:
తేదీ 02-12-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు.
తిథి: శుక్ల పాడ్యమి ఉ 11.11 వరకు, తదుపరి విదియ
నక్షత్రం: జ్యేష్ట ప. 3.57 వరకు, తదుపరి మూల
శుభ సమయం: మ. 2.00 నుంచి 4.00 వరకు
దుర్ముహూర్తం: మ. 12.24 నుంచి 1.12 వరకు తిరిగి 2.46 నుంచి 3.34 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.00 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి.
వృషభ రాశి: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సామాజిక రంగాల్లో తను చేసే ఈ రాశి వారు గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ లాభాలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతతను పొందుతారు.
మిథున రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ప్రయాణాల్లో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. కొత్త శత్రువులు తయారవుతారు. మీ ప్రమేయం లేనప్పటికీ కొన్ని సంఘటనలకు బాధ్యులవుతారు. కుటుంబ విషయాలను వీలైనంత గోప్యంగా ఉంచటం మంచిది.
కర్కాటక రాశి: ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం. కొన్ని సంఘటనలు ఊహాతీతంగా జరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూల సమయం.
సింహరాశి: ఈ రాశి వారికి సవాళ్లతో కూడుకున్న రోజు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అనుకోని వివాదాల్లో ఇరుక్కుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
కన్య రాశి: ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలం తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీ ప్రతిభతో ఇతరులను ఆకట్టుకుంటారు.
తులారాశి: ఈరోజు ఈ రాశి వారు ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యం పాటించాలి. ఊహించని ఖర్చులు సమస్యలకు దారితీస్తాయి. గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది.
వృశ్చిక రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తూ వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. పిల్లల కదిలికలపై దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలిగి సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం పాలవ్వడం వల్ల ఆందోళన చెందుతారు.
ధనస్సు రాశి: తల్లిదండ్రుల్లో ఒకరు ఆరోగ్యం పాలవడం వల్ల ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఒకరితో విభేదించాల్సి రావచ్చు. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ ఒక సమస్యలో ఇరుక్కుంటారు. సంయమనం పాటించడం వల్ల దాని నుంచి బయటపడగలరు. వ్యాపార భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు.
మకర రాశి: పురోగతిలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక సంబంధ వివాదాలు కొలిక్కి వస్తాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఆలోచనను వెంటనే అమలు చేయడం మంచిది.
కుంభరాశి: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు అద్భుతమైన రోజు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా అద్భుతమైన లాభాలను అందుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
మీన రాశి: ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి చేయాలనుకున్నప్పటికీ చెడు ఎదురు అవుతుంది. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. వ్యక్తిగత జీవితంలో నెలకొన్న సమస్యలను తండ్రితో చెప్పడం ద్వారా పరిష్కారం అవుతాయి. రాజకీయ రంగాల వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి.