పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళ పక్షం
సూర్యోదయం: ఉ 6:35
సూర్యాస్తమయం : సా.5:33
తిథి: మార్గశిర బహుళ అమావాస్య రా.12:31 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : మూల రా.6:35 వరకు తదుపరి పూర్వాషాఢ
కరణం: చతుష్పాత్ మ.1:43 వరకు తదుపరి నాగవ
యోగం: వృద్ధి మ.10:12 వరకు తదుపరి ధృవం
వర్జ్యం: మ.3:21 నుండి 4:51 వరకు తదుపరి రా.1:51 నుండి 3:21 వరకు
దుర్ముహూర్తం:సా.4:13 నుండి 4:57 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం:మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:04 నుండి 4:27 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:14 నుండి 6:02 వరకు
అమృతఘడియలు: మ.3:21 నుండి 4:57వరకు తదుపరి రా.1:51 నుండి 3:21 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:58 నుండి మ.12:42 వరకు
ఈరోజు (02-01-2022) రాశి ఫలితాలు
మేషం: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.
వృషభం: ద్రూరప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. సంతానం విద్య ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బంది పడతారు.
మిథునం: సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
కర్కాటకం: సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు
సింహం: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
కన్య: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల: సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి , ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి.. వ్యాపార , ఉద్యోగాలలో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది.
వృశ్చికం: మిత్రులతో సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమౌతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి , ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి.
ధనస్సు: సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు.
మకరం: వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. మన మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కుంభం: నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మీనం: నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందువినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుతాయి
483223 654689Seriously extremely great contribution, I actually depend on up-dates of your stuff. 528106
859228 773375Yay google is my king assisted me to discover this outstanding web site! . 647862
235841 18912I like this internet internet site very a lot, Its a truly good post to read and get info . 569041
770838 393299I truly enjoyed reading this internet site, this really is fantastic weblog. 688733
747592 999142Hello there! Very good post! Please inform us when I will see a follow up! 918751