పంచాంగం:
తేదీ 01- 10 – 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:51 గంటలకు.
తిథి: బహుళ చతుర్దశి రా. 8.33 వరకు తదుపరి అమావాస్య
నక్షత్రం: పుబ్బ ఉ 9.54 వరకు, తదుపరి ఉత్తర
దుర్ముహూర్తం: ఉ 08.21 నుంచి 9.12 వరకు, రా. 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: మ. 12.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మళ్లీ తెరపైకి రావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇంటి పెద్దలతో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. సహనంతో వ్యవహరించాల్సిన సమయం. నూతన ప్రాజెక్టులు చేపట్టాలనుకునే వ్యాపారులు ప్రయత్నాలను విరమించుకోవడం మంచిది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభ రాశి: గాయపడే ప్రమాదం ఉన్నందున ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పైనా దృష్టి పెట్టాలి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇంటి సభ్యుల మధ్య మనస్పర్దలు తలెత్తుతాయి. ఉద్యోగులు పై అధికారులతో సంభాషించేటప్పుడు సహనంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.
మిథున రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత స్నేహితులను కలుసుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త వెంచర్లను ప్రారంభించే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. రుణాలను ఎక్కువ మొత్తంలో తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కర్కాటక రాశి: ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఎవరికైనా ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి. విద్యార్థులు ఏకాగ్రత పెట్టడం వల్ల నూతన విద్యావకాశాలను అందుకుంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఇవ్వడం మంచిది.
సింహరాశి: సహోద్యోగుల ప్రవర్తన వల్ల కలత చెందుతారు. పూర్వీకుల ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు అందుతాయి.
కన్యరాశి: ఆలోచనల్లో నిలకడ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. అనవసర వివాదాల్లోకి దిగకండి. మనసు నిశ్చలంగా ఉంచుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.
తులారాశి: సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెంచుకుంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇతరుల మన్ననలు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. నూతన వస్తూ వాహనాలు కొనుగోలు చేస్తారు. రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు.
వృశ్చిక రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వివాదాలకు దూరంగా ఉండాలి. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. ఆప్తులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మృదు సంభాషణ అలవర్చుకోవాలి. వ్యాపార ప్రత్యర్థులు హాని కలిగించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
ధనస్సు రాశి: మిశ్రమకాలం. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలను తొలగించే ప్రయత్నం చేస్తారు. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండాలి. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఇంటి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. రెచ్చగొట్టేవారున్నారు.. జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. వివాదాలు తొలగిపోతాయి. పురోగతిలో నెలకొన్న అడ్డంకులు తగ్గుముఖం పడతాయి. బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. రాజకీయ రంగాల వారికి నూతన పదవీ బాధ్యతలు అందుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలను అందుకుంటారు.
కుంభరాశి: అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది తిరిగి వసూలు అవడం కష్టం అవుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి.
మీనరాశి: ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. మనోధైర్యంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే మీ కల నెరవేరుతుంది.