పంచాంగం
తేదీ 01-12-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు.
తిథి: అమావాస్య ఉ 10.30 వరకు, తదుపరి పాడ్యమి
నక్షత్రం: అనురాధ ప. 2.30 వరకు తదుపరి జ్యేష్ట
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సా 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేషరాశి: గ్రహబలం అనుకూలంగా లేదు. మంచికి పోయినా చెడు ఎదురవుతుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది.
వృషభ రాశి: అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
మిథున రాశి: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. కొన్ని విషయాల్లో స్పష్టమైన వైఖరి కనబర్చాలి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి: ఆత్మ విశ్వాసం తో మొదలుపెట్టే పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి దరి చేరకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
సింహరాశి: జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటి పెద్దల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదించాల్సి రావచ్చు. ఆ సమయంలో సహనంతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
కన్యారాశి: అదృష్ట కాలం. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువును తిరిగి పొందగలుగుతారు.
తులారాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందుతారు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి: ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. కీలక సమయాల్లో స్నేహితుల తోడ్పాటు లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి, రుణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ధనస్సు రాశి: అదృష్ట కాలం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ స్వల్ప లాభాలు పొందుతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ప్రత్యర్థులు ఆటంకాలు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
కుంభరాశి: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉన్నారు. ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో విశేషమైన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
మీన రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. విలువైన వస్తువులను పోగొట్టుకోవాల్సి రావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగులు సందర్భానుసారంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు లాభాలు పొందటానికి స్వల్పంగా శ్రమించాల్సి రావచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.