Dadasaheb Phalke awards: భారతదేశ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke awards) అవార్డుల కార్యక్రమం 2024కు సంబంధించిన వేడుక అట్టహాసంగా ముంబైలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో హీరోహీరోయిన్లు, టెక్నీషియన్లు పాల్గొని సందడి చేశారు. ఏడాదిగా విడుదలైన సినిమాల జాబితా నుంచి ఉత్తమమైనవి ఎంపిక చేసి అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్.. (Sharukh Khan) ఉత్తమ నటిగా నయనతార.. (Nayanthara) ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నిలిచారు.
విజేతల వివరాలు..
ఉత్తమ నటుడు (నెగటివ్).. బాబీడియోల్ (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్).. విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు.. అనిరుధ్
ఉత్తమ గీత రచయిత.. జావెద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్ సే ధున్కీ)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్.. శిల్పా రావు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ.. యేసుదాసు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. మౌషమీ ఛటర్జీ
వీరితోపాటు టెలివిజన్ విభాగం.. వెబ్ సిరీస్ విభాగంలో కూడా అవార్డులు ప్రకటించారు.