బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ జనవరి 12న తొలిరోజు కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.56 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సితార సంస్థ అధికారికంగా ప్రకటించింది. జనవరి 12న తెల్లవారుజామున బెన్ ఫిట్ షోల నుంచి ఈ మూవీ మొదలైంది.
డే-1 కలెక్షన్లలో బాలయ్య కెరీర్ లోనే ఈ మూవీ భారీ వసూళ్లు సాధించిందనీ, బాలయ్య హీరోయిజం, బాబి టేకింగ్ కి తమన్ బీజీఎం తోడవడంతో యూఎస్ లో మొదటి రోజే 1 మిలియన్ ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలిరోజు మంచి టాక్ రావడంతో జనవరి 13న కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయనీ చెబుతున్నారు. రేపు విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అవుతోంది. ఆ మూవీ రిజల్ట్ ను బట్టి డాకు మహారాజ్ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ టాక్ వచ్చినా డాకు మహారాజ్ మూవీ కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదనీ, ఎందుకంటే అది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కాబట్టి మాస్ సినిమా చూడాలనుకునే వారు కచ్చితంగా డాకు సినిమానే చూస్తారని మూవీ టీమ్ అంచనా వేస్తోంది.