Custody Movie Review: అక్కినేని నాగ చైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కస్టడీ. ప్రమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
పోలీస్ కాన్స్టేబుల్ అయిన శివ ముఖ్యమంత్రిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్రమంతా ఫేమస్ అవుతాడు. చిన్నప్పటి నుండి ఒకమ్మాయిని ఇష్టపడుతుంటాడు, తననే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఇదిలా ఉండగా సంపత్ రాజ్, అరవింద్ స్వామి పాత్రల మధ్య శివ ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య కన్ఫ్లిక్ట్ ఏంటి? దాని వల్ల శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అన్నది చిత్ర కథాంశం.
నటీనటులు:
అక్కినేని నాగ చైతన్య హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానిస్టేబుల్ పాత్రకు సరిపోయేలా తనను తాను మలుచుకున్న విధానం మెప్పిస్తుంది. ఇక క్రిమినల్ గా అరవింద్ స్వామి పెర్ఫార్మన్స్ బాగుంది. కృతి శెట్టికి లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ దక్కింది. ఆమె పర్వాలేదు.
ప్రియమణి నటన కూడా బాగుంది. ఇక మిగతా నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా ఓకే.
సాంకేతిక నిపుణులు :
వెంకట్ ప్రభు రాసుకున్న కథలో విషయం ఉంది. యాక్షన్ థ్రిల్లర్స్ కు పెట్టింది పేరైన వెంకట్ ప్రభు ఈసారి కూడా సెటప్ కరెక్ట్ గా సెట్ చేసాడు. అయితే కస్టడీ విషయంలో ఉన్న ప్రధాన కంప్లైంట్… స్లో నెస్. కథ ఓ పట్టాన ట్రాక్ ఎక్కదు. మెయిన్ కన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చేదాకా కస్టడీ నత్తనడకన సాగుతుంది. ఇక నరేషన్ లో వెంకట్ ప్రభు మార్క్ మిస్ అయింది.
యువన్ శంకర్ రాజా, ఇళయరాజా కలిసి హ్యాండిల్ చేసిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ విచిత్రంగా బ్యాడ్ అవుట్ పుట్ గా మారింది. అటు మ్యూజిక్ కానీ ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వలేదు.
ఇక చిత్ర ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది.
ప్లస్ పాయింట్స్:
- యాక్షన్ సీక్వెన్సెస్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- వీక్ నరేషన్
- స్క్రిప్ట్
విశ్లేషణ:
ఈ చిత్రం పట్ల నాగ చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే కస్టడీ చివరికి బిలో యావరేజ్ చిత్రంగా నిలుస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 1.75/5