చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి పవన్ కళ్యాణ్ విరాళం ఇవ్వొచ్చు కదా.? మ్యూజికల్ ఈవెంట్‌లో ఎంజాయ్ చేసి, విరాళం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారు.! చంద్రబాబు మెప్పు కోసమే ఎన్టీయార్ ట్రస్ట్ ఈవెంట్‌కి హాజరైన పవన్ కళ్యాణ్.!
ఇవీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న విమర్శలు. వైపీపీతో పాటు, పవన్ కళ్యాణ్ అంటే గిట్టని ఓ వర్గం కూడా, పవన్ కళ్యాణ్ మీద ఇవే విమర్శల్ని చేస్తూ సోషల్ మీడియాలో నానా యాగీ చేస్తోంది.
అసలు, జరిగిన మ్యూజికల్ ఈవెంట్ దేనికోసం.? పవన్ కళ్యాణ్ ఎందుకు యాభై లక్షల రూపాయల విరాళాన్ని ఆ వేదికపై నుంచి ప్రకటించారు.? ఇవేవీ తెలుసుకునేంత తీరిక, ఓపిక.. ఆయన్ని ట్రోల్ చేస్తున్నవారికి లేవు. వుంటే, ట్రోల్ చేసే పరిస్థితే వుండదు.
తలసీమియా బాధితులకు సాయం చేసే క్రమంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఓ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది.. సినీ సంగీత దర్శకుడు తమ్ నేతృత్వంలో. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ టిక్కెట్ కొనుక్కుని వెళితే, తద్వారా వచ్చే సొమ్ముని తలసీమియా బాధితుల సహాయార్థం ఉపయోగపడుతుందన్నది ఎన్టీయార్ ట్రస్ట్ ఉద్దేశ్యం. రాజకీయాల్ని పక్కన పెట్టి, ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలి.
అంతేగానీ, తలసీమియా బాధితుల సహాయార్థం నిర్వహించిన కార్యక్రమంపై అవాకులు చెవాకులు పేలడం. ఆ కార్యక్రమంలో తలసీమియా బాధితులకు 50 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తే, దాని మీద వెటకారాలు చేయడమంటే.. అంతకన్నా రాక్షసత్వం ఇంకోటి వుండదు.
తలసీమియా అంటే, ఆషామాషీ అనారోగ్య సమస్య కాదు. నిత్యం వేలాది మంది, లక్షలాది మంది తలసీమియా బాధితులు తెలుగు రాష్ట్రాల్లో విలవిల్లాడుతున్నారు. వాళ్ళకి సకాలంలో రక్తం అందాలి. అందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం, శక్తివంచన లేకుండా కృషి చేయాల్సి వుంది తలసీమియా బాధితుల్ని ఆదుకునేందుకు.
సామాజిక బాధ్యతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తలసీమియా బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జరిగిన కార్యక్రమాన్ని కేవలం మ్యూజికల్ ఈవెంట్‌గా చూస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? నిజానికి, అదొక దైవ కార్యంగా భావించాల్సి వుంటుంది.
తలసీమియా బాధితులతో ఒక్కసారైనా మాట్లాడితే, జరిగిన ఈవెంట్ ఎలాంటిదో ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఎంత గొప్పదో తలసీమియా ా బాధితులకు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అర్థమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ మానవ జాతికే వైసీపీ అత్యంత హానికరం.. అన్న విషయం, ఇదిగో ఇప్పుడు ఇంకోసారి నిరూపితమయ్యింది. వైసీపీ ఏనాడూ ఈ తరహా సామాజిక సేవా కార్యక్రమాలు చేసింది లేదు. అందుకే, సాయం చేసేవాళ్ళని చూస్తే వైసీపీకి కడుపు మంట.!
కేవలం మ్యూజికల్ ఈవెంటే అయితే, పవన్ కళ్యాణ్ అసలు ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారే కాదు. 50 లక్షల రూపాయల కష్టార్జితం, తలసీమియా బాధితుల సహాయార్థం ఎంతగానో ఉపయోగపడుతుందనే కోణంలో ఓ గొప్ప వేదికగా భావించి, ఎన్టీయార్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కీ.. సాయం అందుకునే తలసీమియా బాధితులకీ.. ా సాయాన్ని అర్థం చేసుకున్నవాళ్ళకి మాత్రమే.. ఆ విలువ ఏంటో తెలుస్తుంది.!