Switch to English

కోవిడ్‌-19: అంతలా భయపెట్టి, ఇంతలా లైట్‌ తీసుకోవడమా.?

కరోనా వైరస్‌ని ప్రపంచ మహమ్మారిగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది. అందుకు తగ్గట్టే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మరణ మృదంగం మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికానే కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. దాదాపుగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. కొన్ని దేవాలు.. ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి దెబ్బ నుంచి కోలుకుంటున్నాయి.

అయితే, సెకెండ్‌ వేవ్‌.. థర్డ్‌ వేవ్‌ ఇంకా ప్రమాదకరంగా వుండబోతున్నాయనే హెచ్చరికలు వైద్య నిపుణుల నుంచి వెల్లువెత్తుతున్న వేళ, లాక్‌డౌన్‌ని ఎత్తివేయడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ తెరపైకొస్తోంది. అయినాగానీ, ఎన్నాళ్ళిలా ఈ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కూరుకుపోతాం.? అన్న వాదనలూ లేకపోలేదు.

ఇదిలా వుంటే, మన దేశంలో మే 3 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేయడం ఖాయమన్న లీకులు బయటకొస్తున్నాయి. అందుకు తగ్గ రీతిలో ఆయా విభాగాలు తెరవెనుక సన్నద్ధమవుతున్నాయి కూడా. మరోపక్క, కరోనా వైరస్‌కి సంబంధించి ఐసోలేషన్‌ విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది కేంద్రం. తక్కువ లక్షణాలు వున్నవారికి హోమ్ ఐసోలేషన్‌ని ప్రతిపాదించింది కేంద్రం. రాష్ట్రాలు సైతం ఇప్పటికే ఈ విషయమై స్పష్టమైన సంకేతాలు పంపేశాయి.

అంటే, ముందు ముందు కరోనా వైరస్‌ వస్తే.. తేలికపాటి లక్షణాలు వుంటే ఇంటి వద్దనే ఐసోలేషన్‌ అన్నమాట. కానీ, అదెంతవరకు సాధ్యపడుతుంది.? భారతీయుల్లో ఎంతమందికి ‘హోమ్ ఐసోలేషన్‌’ అవకాశాలున్నాయి.? అన్నదే కీలకం ఇక్కడ. కరోనా వైరస్‌ని మహమ్మారి అంటున్నాం.. అలాంటప్పుడు, దానిపై ఖచ్చితమైన పర్యవేక్షణ అవసరం. హోమ్ ఐసోలేసన్‌ అంటే పర్యవేక్షణ ఎలా వుంటుంది.? ఒక్కసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక (దశల వారీగానే అయినా), హోమ్ ఐసోలేషన్‌ కూడా షురూ అయితే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేం.

పైగా, అది విచ్చలవిడిగా జనంలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలెందుకు ఇప్పుడు కరోనా వైరస్‌ని లైట్‌ తీసుకుంటున్నాయి.? కీలక సమయంలో ఈ వెకిలి చర్చ ఏమిటి.? అనే వాదన నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ‘తప్పదు, దేశ ఆర్థిక స్థితి.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు.. అన్నిటికీ మించి ప్రజా జీవనం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రిస్క్‌ చేయాల్సిందే..’ అనేవారూ లేకపోలేదు. కానీ, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్‌.. నిన్న నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1900 దాటింది. కరినతరమైన లాక్‌డౌన్‌ అమల్లో వున్నప్పుడే పరిస్థితి ఇలా వుంటే, వెసులుబాట్లు ఎత్తివేస్తే.. ఆ సంఖ్య పదింతలవుతుందో.. వంద రెట్లు అవుతుందో.!

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

నిమ్మగడ్డ ఎందుకు తగ్గినట్టు?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తాను చార్జి తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ మేరకు ఓ పత్రికా ప్రకటన...

మహేష్‌ ‘సర్కార్‌ వారి పాట’ పాడనున్నాడా?

గీత గోవిందం చిత్రంతో దర్శకుడిగా సూపర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న వీరిద్దరి కాంబో మూవీ లాక్‌...

బాలయ్య కోసం మొదటి టఫ్ టాస్క్ ఫినిష్ చేసిన బోయపాటి శ్రీను

నందమూరి బాలకృష్ణ కెరీర్లో 'సింహా ', 'లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో చేస్తున్న మూడవ సినిమా మార్చిలో మొదలై 13 రోజుల షూటింగ్ ని...

తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా...

క్రైమ్ న్యూస్: 10 యేళ్ల కొడుక్కు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది

అనారోగ్యంతో పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నాను అనే బాధతో భార్గవి అనే గృహిణి తన పదేళ్ల కొడుకుకు ఉరి వేసి అతడు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది....