MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు కావాలనే నెగటివ్ రివ్యూలు, ఆటోమేటెడ్ బాట్ల ద్వారా రేటింగ్ లను తగ్గిస్తూ సినిమాలకు తీరని నష్టం కలిగిస్తున్నారు. ఇది పరిశ్రమలో తీవ్రమైన సమస్యగా మారింది. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ఇటువంటి చర్యలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి డిజిటల్ ప్లాట్‌ఫారమ్, సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, నెగిటివ్ క్యాంపెయిన్స్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.
కేసును విచారించిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగా సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను పరిమితం చేయాలని, బాట్ల ద్వారా రేటింగ్స్ ఇవ్వకుండా నియంత్రించాలని, ‘బుక్ మై షో’లో కూడా రేటింగ్స్ ఆపాలని ఆదేశించింది. వీటిని అడ్డుకట్ట వేసేందుకు ‘BlockBIGG & Aiplex’ సంస్థలు రంగంలోకి దిగాయి. కోర్టు ఆదేశాలతో ‘మన శంకరవరప్రసాద్ గారు’కి బాట్స్ ఉపయోగించి రివ్యూ, రేటింగ్స్ ఇవ్వడం కుదరదు. ‘బుక్ మై షో’ కూడా రివ్యూ, రేటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది. టాలీవుడ్ చరిత్రలో తొలిసారి కోర్టు మద్దతుతో తీసుకున్న డిజిటల్ లీగల్ షీల్డ్ అని చెప్పాలి. చిరంజీవి సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో వచ్చే సినిమాలకు వరంగా మారనుందని చెప్పాలి.
We Thank AiPlex and BlockBigg for leading this ground-breaking initiative to safeguard cinema from orchestrated digital manipulation.
This historic, court-backed step to restrict malicious reviews and down-ranking sets a powerful precedent for fair and transparent digital… pic.twitter.com/kmIxgi3bHP
— Shine Screens (@Shine_Screens) January 10, 2026
