ప్రపంచవ్యాప్తంగా పెను మహమ్మారిగా విధ్వంసం సృష్టిస్తున్న కరోనా నివారణకు సరికొత్త మందు అందుబాటులోకి వచ్చింది. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఔషధం చాలా మంచి ఫలితాలు ఇస్తోందని తాజాగా తేలింది. ఈ విషయాన్ని హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి చైర్ పర్సన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కాక్ టెయిల్ మందును హైదరాబాద్ లో 40 మంది రోగులకు ఇవ్వగా.. సానుకూల ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ ఔషధాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు చికిత్స చేసినప్పడు వాడారు.
ప్రస్తుతం ఈ కాక్ టెయిల్ తీసుకున్నవారంతా తేలికపాటి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నవారేనని నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన మూడు నుంచి వారం రోజుల్లోనే వారికి కాక్ టెయిల్ ఇవ్వగా.. 24 గంటల నుంచి 48 గంటల్లోనే వారందరికీ జ్వరం, నీరసం వంటి కరోనా లక్షణాలు పోయాయని వెల్లడించారు. డెల్టా వేరియంట్ పై ఈ ఔషధం పనితీరు, ప్రభావశీలతను తెలుసుకునేందుకు తాము అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. మొత్తానికి కాక్ టెయిల్ ఔషధం బాగా పనిచేస్తోందన్నారు. కాగా, దీని ధర రూ.70వేలు.
965990 296738You produced some decent points there. I looked on the internet for the issue and located most individuals will go along with with your internet site. 743685
903409 513474There is noticeably a bundle to realize about this. I assume you produced various nice points in functions also. 411432