Switch to English

ఓ వైపు కరోనా భూతం.. ఇంకో వైపు ‘కమ్మోడి’ పైత్యం.!

మానవాళికి పెను సవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌ (కోవిడ్‌19). ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.. ‘వ్యాక్సిన్‌’ కోసం. తెలుగు నేతల నుంచీ పెద్దయెత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. ‘ఇదిగో వ్యాక్సిన్‌ అభివృద్ధి.. అదిగో క్లినికల్‌ ట్రయల్స్‌..’ అంటూ వార్తలు వింటున్నాం.

ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ ఏ విషయంలోనూ ఇంత పెద్దయెత్తు, ఇంత వేగంగా పరిశోధనలు జరిగింది లేదు. అంత పెద్ద ముప్పుని తీసుకొచ్చింది కరోనా వైరస్‌. మన తెలుగు నేల నుంచి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలి భర్త కూడా కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ కథనం ఈనాడు దిన పత్రికలో ప్రముఖంగా కన్పించింది. దీనిపై ‘కుల ముద్ర’ వేసే ప్రయత్నం కొందరు చేస్తోంటే, ‘ఆ క్రెడిట్‌ దక్కాల్సింది వేరేవారికి..’ అంటూ ఇంకొందరు వాదిస్తున్నారు.

తన మనవరాలి భర్త కాబట్టి, ఓవర్‌ పబ్లిసిటీ ఇస్తున్నారన్నది ఇంకో వాదన. అసలు ఈ గోల అంతా ఎందుకు తెరపైకొచ్చింది.? అంటే, మళ్ళీ ఇక్కడ ‘కులం ప్రస్తావన’ తప్పదు. అవును, ‘ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కి చెక్‌ పెట్టేందుకు శ్రమిస్తోన్న కమ్మోడు..’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది. పాపం ఆ కరోనా వైరస్‌కి ఈ కులాల గురించి పెద్దగా తెలియకపోవడం వల్లేనేమో.. అందర్నీ కబలించేస్తోంది.

కరోనా వైరస్‌కి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు.. డబ్బున్నోడు, పేదోడన్న తేడాల్లేవు.. అందర్నీ ఏకబిగిన అంతమొందించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 12 లక్షల మంది కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులుగా తేలారు. ఇప్పుడు, ఇలాంటి సమయాల్లో ఈ ‘కమ్మ’ గోలేంటి.?

నిజానికి, కమ్మ సామాజిక వర్గంలోనూ చాలామంది ఇలాంటి సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌ని సమర్థించకపోవడం గమనార్హం. ఇదిలా వుంటే, వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న రేచస్‌ చల్లా (రామోజీరావు మనవరాలి భర్త)ను అభినందిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, కరోనా వైరస్‌పై వ్యాక్సిన్‌ని తయారు చేయడంలో విజయవంతమవ్వాలనీ ఆకాంక్షించారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఈసారి సూర్య ఆ పని చెయ్యట్లేదు.!

తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న కొంత మంది తమిళ హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తమిళంలో సినిమా...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

ప్రకంపనలు రేపుతున్న నాగబాబు కొత్త ట్వీట్.!

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న...

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...